📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Delhi: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన కారు

Author Icon By Sharanya
Updated: July 13, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ (Delhi) నగరంలో మరోసారి మద్యం మత్తు మానవతను ముంచెత్తింది. జూలై 9వ తేదీ తెల్లవారుజామున 1.45 గంటల సమయంలో వసంత్ విహార్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న (Sleeping on the footpath) నిరాశ్రయులపై వేగంగా దూసుకొచ్చిన ఆడి కారు ఐదుగురిని తొక్కుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల బాలిక సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, అప్పటికే బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నిందితుడు ఎవరు?

నిందితుడైన డ్రైవర్‌ను ద్వారక ప్రాంతానికి చెందిన రియల్టర్ ఉత్సవ్ శేఖర్ (Utsav Shekhar) (40)గా గుర్తించారు. ఘటన జరిగిన ప్రాంతంలోనే ఆయనను అరెస్ట్ చేశారు. నొయిడా నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అరెస్ట్ అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా తాగిన మత్తులో డ్రైవ్ చేసినట్టు తేలింది.

బాధితుల పరిస్థితి

గాయపడిన వారిని లఢీ (40), ఆమె కుమార్తె బిమ్ల (8), భర్త సబామి అలియాస్ చిర్మా (45), రామ్ చందర్ (45), ఆయన భార్య నారాయణి (35)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ప్రత్యక్ష సాక్షుల వర్ణన

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వేగంగా దూసుకొచ్చిన కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని తొక్కుకుంటూ దూసుకెళ్లింది. అదే వేగంతో ముందుకెళ్తూ ట్రక్కును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మే నెలలోనూ ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. అదుపుతప్పి వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డుపక్కన వెళ్తున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Odisha: టీచర్ లైంగిక వేధింపులు.. కాలేజీ లోనే నిప్పంటించుకున్న యువతీ

Audi Car Accident Delhi Breaking News Delhi Accident Drunk Driving Incident Delhi Footpath Car Crash latest news Telugu News Utsav Shekhar Arrested

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.