పాకిస్తాన్ ఎప్పటికీ తన బుద్ధిని మార్చుకోదు. ఉగ్రవాదం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆదేశ తాపత్రయం ఎప్పటికీ నెరవేరదు. మతం పేరుతో అమాయకుల ప్రాణాలను తీస్తూ, ఆర్థికంగా భారతదేశానికి నష్టాన్ని కలిగించే కుట్ర పాక్ కి కొత్తేమీ కాదు. తాజాగా ఢిల్లీ బాంబు పేలుడులో తన పాత్ర ఉందని చెప్పకనే చెబుతున్న పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాల్సిందే.
తాజాగా పాకిస్తాన్ (Pakistan) నేత చౌదురి అన్వరుల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పేలుళ్లలో తమ పాత్ర ఉందని ఆయన నేరుగా ఒప్పుకున్నారు. బలూచిస్తాన్ లో భారత్ జోక్యం చేసుకుంటే ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు మిమ్మల్ని దెబ్బతీస్తామని నేను ముందే చెప్పాను.
Read Also: Gold Prices: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల ఎంసీఎక్స్ తాజా వివరాలు

పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ మాతో యుద్ధం
అల్లాహ్ కృపతో దానిని మీ వీరులు నిజం చేశారంటూ పీవోకే అసెంబ్లీలో అన్వరుల్ హక్ అన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలోనే నేరుగా వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఇప్పటివరకు స్పందించని పాక్ .. నోరుపారేసుకున్న ఖవాజా (Khawaja) అయితే ఢిల్లీ బాంబు పేలుళ్లపై (Delhi bomb blasts) పాకిస్తాన్ ఇప్పటివరకూ స్పందించలేదు. అలాగని ఖండించనూ లేదు. కానీ మరోవైపు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ మాతో యుద్ధం చేయడానికి రెడీగా ఉందని.. తాము కూడా అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యలు చేశారు.
ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి అప్రమత్తతతో ఉన్నామని ప్రకటించారు. అవసరమైతే పొరుగు దేశానికి బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తించాలో నేర్పించడానికి తమ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని ఖవాజా పేర్కొన్నారు. అందరూ కలిసే పేలుళ్ల కు కుట్ర పన్నారు. ఇంకోవైపు బలూచిస్థాన్ లో వేర్పాటువాద ఉద్యమం వెనుక భారత్ ఉందని పాక్ పదేపదే చేస్తోన్న ఆరోపణలను న్యూఢిల్లీ తిప్పికొట్టింది.
మద్దతు ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ
పాక్ సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాల నుంచి ప్రపంచ దృష్టి మళ్లించే ప్రయత్నమని చెప్పింది. బలూచ్ లో జరిగే హింసకు తమకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇకపోతే ఢిల్లీ పేలుళ్ల వెనుక పాక్ మద్దతు ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఉందని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ను జైషే ఉగ్రవాద సంస్థతో నేరుగా సంబంధాలున్న జమ్మూకశ్మీర్ లోని పోపియాన్ కు చెందిన మతపెద్ద మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ ప్రోద్భలంతో డాక్టర్లు ఉగ్రవాదులుగా మారినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటి వరకు అల్ ఫలాహ్
యూనివర్సిటీకి చెందిన పలువురు వైద్యులను ఎన్ ఐఏ అదుపులోకి తీసుకుంది. వీరిలో లేడీ డాక్టర్ షహీన్ సయ్యద్ జైషే మహిళా విభాగం భారత్ చీఫ్ గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీ పేలుళ్లకు పాల్డిని ఉమర్ నబీ (Umar Nabi) కూడా ఫరీదాబాద్ లో అల్-ఫలాహ్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్యుడని, అందరూ కలిసే ఈ పేలుళ్లకు పథకం చేశారని చెప్పారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: