📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Delhi Blast Updates: ఢిల్లీలో పేలుడు కలకలం.. బాధితుల లిస్ట్

Author Icon By Tejaswini Y
Updated: November 11, 2025 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ రాజధాని డిల్లీ(Delhi Blast Updates) మరోసారి దుర్ఘటనకు వేదికైంది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన బాంబు పేలుడు ప్రాంతమంతా ఉలిక్కిపడేలా చేసింది. ఐ20 కారు ఒక్కసారిగా పేలిపోవడంతో అక్కడి వాహనాలు, షాపులు, పోలీస్ పోస్ట్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో కొంతమంది మృతిచెందగా, అనేకమంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన తరువాత పోలీసు మరియు కేంద్ర దర్యాప్తు సంస్థలు సంఘటనా స్థలాన్ని ముట్టడి చేసి ఆధారాలను సేకరిస్తున్నాయి. ఇప్పటివరకు మృతుల వివరాలు పూర్తిగా వెల్లడికాలేదు. గాయపడిన వారి జాబితా కొంతవరకు బయటకు వచ్చింది.

Read Also: Esha Deol: మా తండ్రి చనిపోలేదు: ఈషా డియోల్

Delhi Blast Updates: ఎర్రకోట పరిసర ప్రాంతం పర్యాటకులు, స్థానికులతో రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ఈ పేలుడు మరింత భయానక వాతావరణం సృష్టించింది. ఒక్కసారిగా సంభవించిన ఈ ఘటనతో వాహనదారులు, వ్యాపారులు భయాందోళనకు గురయ్యారు.

ఉగ్రవాద చర్య కావచ్చని పోలీసులు

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది ఉగ్రవాద చర్య కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనితో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

పోలీసులు ప్రజలను శాంతంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల గురించి వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.

గాయపడినవారి జాబితా (Delhi Blast Victims List):

ఆజాద్ – 5వ పుష్ట, కర్తార్ నగర్, ఢిల్లీ

షైన్ పర్వీన్ – మిర్ఫ్ రోడ్, ఢిల్లీ

హర్షుల్ – గదర్‌పూర్, ఉత్తరాఖండ్

శివ జైస్వాల్ – డియోరియా, ఉత్తరప్రదేశ్

సమీర్ – మండవాలి, ఢిల్లీ

జోగిందర్ – నంద్ నగరి, దిల్షాద్ గార్డెన్, ఢిల్లీ

భవానీ శంకర్ సహర్మ – సంగం విహార్, ఢిల్లీ

గీత – కృష్ణ విహార్, ఢిల్లీ

వినయ్ పాఠక్ – అయా నగర్, ఢిల్లీ

పప్పు – ఆగ్రా, ఉత్తరప్రదేశ్

వినోద్ – బాట్జిత్ నగర్, ఢిల్లీ

శివం ఝా – ఉస్మాన్‌పూర్, ఢిల్లీ

అమన్ – వివరాలు తెలియవు

మహ్మద్ షానవాజ్ – దర్యాగంజ్, ఢిల్లీ

అంకుష్ శర్మ – ఈస్ట్ రోహ్తాష్ నగర్, షాహదారా

మహ్మద్ ఫరూక్ – దర్యాగంజ్, ఢిల్లీ

తిలక్ రాజ్ – రోహంపూర్, హిమాచల్ ప్రదేశ్

మహ్మద్ సఫ్వాన్ – సీతా రామ్ బజార్, ఢిల్లీ

మహ్మద్ దావూద్ – అశోక్ విహార్, ఘజియాబాద్

కిషోరి లాల్ – యమునా బజార్, కాశ్మీరీ గేట్, ఢిల్లీ

ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో భద్రతా చర్యలు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండమని పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AmaravatiNews bombblast DelhiBlast DelhiIncident DelhiMetro DelhiNews DelhiUpdates RedFort RedFortBlast

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.