📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Latest news: Delhi blast: క్లాస్ లో తాలిబన్ రూల్స్ పాటించే ఉమర్ బాగోతం

Author Icon By Saritha
Updated: November 14, 2025 • 12:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మతం కన్నా మానవత్వం మిన్న. మతం క్రూరత్వాన్ని ప్రేరేపిస్తుంది. మానవత్వం మన్నించమని చెబుతుంది. కానీ మతం ముసుగులో టెర్రరిస్టులుగా మారుతూ, మనుష్యులను హతమారుస్తున్నారు. తోటి మానవుడిని ప్రేమించమని, సాధ్యమైతే మేలు చేయమని చెబుతుంది. మేలు చేయకపోతే పర్వాలేదు కానీ కీడు తలపెట్టవద్దని అంటారు. మతం పేరుతో మనుష్యులను చంపే ఏమతమైనా అది మతం కాదు, ఓ ఉన్మాదం. ఉన్నతమైన వైద్యవిద్యను చదివి, పదిమందికి ప్రాణాలను పోయాల్సిన డాక్టర్లు ప్రజల ప్రాణాలను తీసేందుకు కుట్రపడడం అత్యంత గోరమైనది. ఢిల్లీలోని(Delhi) ఎర్రకోట వద్ద కారుబాంబు పేల్చి(Delhi blast) ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మహమ్మద్, గతంలో తాను పనిచేసిన యూనివర్సిటీలో ‘తాలిబన్ తరహా’ కఠిన నిబంధనలు అమలు చేసేవాడని విద్యార్థులు వెల్లడించారు. ఈ ఉగ్రకుట్రతో సంబంధమున్న ఇద్దరు డాక్టర్లు పనిచేసిన ఫరీదాబాద్ లోని అల్ ఫలా యూనివర్సిటీలో ఇండియా టుడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ లో ఈ సంచల విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవంబరు 10న జరిగిన ఐ20 కారు పేలుడులో ఆత్మాహుతి బాంబర్ గా ఉన్న డాక్టర్ ఉమర్ మహమ్మద్, మరో నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ సయీద్ గతంలో ఈ యూనివర్సిటీలోనే అధ్యాపకులుగా పనిచేశారు. వారి గురించి ఇండియా టుడే ప్రతినిధులు విద్యార్థులు, సిబ్బందిని రహస్యంగా పలకరించగా కీలక విషయాలు తెలిసాయి.

Read also: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్..10గ్రా రేట్లు డౌన్

Delhi blast: క్లాస్ లో తాలిబన్ రూల్స్ పాటించే ఉమర్ బాగోతం

ఎప్పుడూ ఒంటరిగా ఉండే ఉమర్

ఉమర్ సార్ మాకు పాఠాలు చెప్పేవారు. మా బ్యాచ్ లో అబ్బాయిలు, అమ్మాయిలు కలిసే కూర్చునేవాళ్లం. కానీ ఆయన క్లాసుకు రాగానే మమ్మల్ని వేరువేరుగా కూర్చోబెట్టేవారు’ అని ఓ ఎంబీబీఎస్ విద్యార్థి తెలిపారు. ఉమర్ ఎప్పుడూ ఒంటరిగా, ఎవరితో కలవకుండా ఉండేవాడని సిబ్బంది పేర్కొన్నారు. ఆయన క్యాంపస్లోని హాస్టల్లోనే నివసించేవారని విద్యార్థులు గుర్తుచేసుకున్నారు. ఇదే కేసులో అరెస్టయిన మరో అధ్యాపకురాలు డాక్టర్ షహీన్ సయీద్ మాత్రం చాలాబాగా పాఠాలు చెప్పేవారని విద్యార్థులు పేర్కొన్నారు. ఉమర్ అతనితో జతకట్టిన వీరు వైట్ కాలర్ గా చెలామణి అవుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

car bomb attack Delhi Red Fort blast Faridabad Al Falah University Latest News in Telugu Taliban-style rules Telugu News Terrorism Investigation Umar controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.