📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Telugu News: Delhi blast: ఢిల్లీ పేలుడు ఘటనలో ఇద్దరు వైద్యవిద్యార్థులు అరెస్టు

Author Icon By Sushmitha
Updated: November 15, 2025 • 5:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీలోని (New Delhi) ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన కారుబాంబు పేలుడు (Delhi blast) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ తన విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒకరు పంజాబ్ కు చెందిన సర్జన్ కాగా మరొకరు పశ్చిమ బెంగాల్ కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి.

ఈ అరెస్టులు దేశవ్యాప్తంగా వ్యాపించిన ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్’ ఉనికిని బలపరుస్తున్నాయి. వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనది. అంతేకాదు వైద్యులపై సమాజంలో కూడా ఉన్నత గౌరవం ఉంది. డాక్టరే దేవుడిగా భావిస్తారు.ఎందుకంటే వైద్యులు రోగుల ప్రాణాలను కాపాడుతారు. కానీ కొందరు తమ పవిత్రమైన వృత్తిని మతం ముసుగులో ఉగ్రవాదులుగా మారుతున్నారు.

Read Also: AP: 99 పైసలకే యాక్సెంచర్, ఇన్ఫోసిస్‌లకు భూమి కేటాయింపు

Delhi blast

ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఎంబీబీఎస్ విద్యార్థులు

అరెస్టు అయిన ఎంబీబీఎస్ విద్యార్థిని (MBBS student) పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర దినాజ్ పూర్ కు చెందిన జనిసూర్ అలియాస్ నిసార్ ఆలంగా గుర్తించారు. నిసార్ గతంలో హర్యానాలోని అల్ ఫలా యూనివర్సిటీలో చదువుకున్నాడు. అలాగే లూధియానాలో నివాసం ఉంటున్నాడు. ఉగ్రవాద సంస్థలతో అతనికి సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఎన్ ఐఏ (ఎన్ఐఎ) అతన్ని అదుపులోకి తీసుకుంది. ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా సూరజ్ పూర్ మార్కెట్ లో నిసార్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని మొబైల్ లొకేషన్ డేటా ఆధారంగా అతని కదలికలపై నిఘా ఉంచిన అధికారులు..అతని నుంచి పలు డిజిటల్ పరికరాలు, ముఖ్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

విచారణ సమయంలో నిసార్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అతనిపై ఉన్న అభియోగాలు, పేలుడుతో అతనికి ఉన్న ప్రత్యక్ష సంబంధాలపై ఎన్ ఐఏ ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. నిసార్ ఆలం కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమారుడు నిర్దోషి అని చెబుతున్నారు. వైద్యులు, విద్యార్థులు వంటి ఉన్నత వర్గాలు ఉగ్రవాద మాడ్యూల్ తో ముడిపడి ఉన్నారనే వాస్తవం భద్రతా సంస్థల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

delhi blast Google News in Telugu Jamia students Latest News in Telugu medical students arrest NIA probe; Telugu News Today terror investigation terrorism.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.