📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest news: Delhi blast: పక్కా ప్రణాళిక తో డాక్టర్లకు ఉగ్రవాదుల వల

Author Icon By Saritha
Updated: November 24, 2025 • 1:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2019 నుంచే డాక్టర్లకు ఉగ్రవాదుల వల

మరోవైపు నవంబర్ 10న ఎర్రకోట(Delhi blast) వద్ద బాంబుదాడితో వెలుగులోకి వచ్చిన వైట్‌కాలర్ ఉగ్ర నెట్వర్క్‌ గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వైద్యుల్లో ఉగ్రవాద భావజాలం 2019 నాటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వేదికగా పురుడు పోసుకుందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. సీమాంతర ఉగ్రవాదంలో మార్పు వచ్చిందనీ పాకిస్థాన్‌, ఇతర దేశాల్లోని ఉగ్ర హ్యాండ్లర్లు డిజిటల్ మార్గాల్లో విద్యావంతులను ఎంపిక చేసుకుని ఉగ్రభావజాలం నింపుతున్నారని దర్యాప్తులో తేలింది. ఉగ్ర డాక్టర్లు ముజమ్మిల్ గనై, అదీల్ రాథర్, ముజఫర్ రాథర్, ఉమర్ నబీ వంటివారు ఫేస్‌బుక్, ఎక్స్​ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో చురుకుగా ఉన్నప్పుడు ఉకాసా, ఫైజాన్, హష్మి అనే ఉగ్ర హ్యాండ్లర్లు వారిని గుర్తించాయి. తర్వాత వారిని సంప్రదించి టెలిగ్రాం, మాస్టోడాన్ వంటి యాప్‌ల్లో గ్రూపుల్లో చేర్చి బ్రెయిన్‌వాషింగ్ చేయడం ప్రారంభించారు. ఏఐ వీడియోలతో ద్వేషాన్ని నింపారని సమాచారం. మొదట్లో సిరియా లేదా అఫ్గానిస్థాన్ వంటి ఘర్షణ ప్రాంతాల్లో ఉగ్రగ్రూపుల్లో చేరాలని ఈ వైద్యులు భావించారని తెలిసింది. కానీ హ్యాండ్లర్లు వారిని భారత్‌లోనే ఉండి అనేక ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడాలని కోరినట్లు స్పష్టమైంది. మరోవైపు ఉగ్రవాదులు పేలుడు పదార్థాల తయారీని యూట్యూబ్‌లో చూసి కొంత నేర్చుకున్నారని తెలుస్తోంది.

Read also: ‘భూ భారతి’ Website లో భూముల మార్కెట్ విలువ

Terrorists trap doctors with a well-planned plan

అద్దె చెల్లింపు కోసం మౌల్వీ ఇంటిని ఉపయోగించుకున్నారు

మరోవైపు ఢిల్లీ(Delhi) బాంబుదాడి కేసులో అదుపులోకి తీసుకున్న హరియాణా మత బోధకుడు మౌల్వీ ఇష్తియాక్‌ ప్రవర్తన ఆసక్తిగా మారింది. అల్‌ఫలాహ్‌ యూనివర్సిటీ(Delhi blast) సమీపంలో ఉన్న మౌల్వీ ఇష్తియాక్‌ ఇంట్లోనే ఉగ్రవాదులు భారీగా దాచిన పేలుడు పదార్థాలను తొలిసారి పోలీసులు గుర్తించారు. మౌల్వి ఇష్తియాక్ విచారణ అధికారులకు చెప్పిన విషయాలు ఆసక్తిగా మారాయి. గనై, ఉమర్‌లు మొదట్లో తనను సంప్రదించి ఎరువులను నిల్వ చేసుకునేందుకు గదిని అద్దెకు అడిగారని వివరించారు. నెలకు 2వేల 500 రూపాయలు చెల్లించాలని చెబితే వారు అంగీకరించారని ఇష్తియాక్ వివరించాడు. ఆరు నెలలుగా వారు అద్దె చెల్లించలేదని, తనకు ఆ డబ్బును ఇప్పించాలని దర్యాప్తు అధికారులనే ఇష్తియాక్‌ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాను పేదవాడినని నలుగురు పిల్లలు ఉన్నారని, దయచేసి డబ్బు ఇప్పించాలని బతిమలాడుకున్నాడు. ఇంత తీవ్రమైన కేసు గురించి ఆలోచించకుండా ఇష్తియాక్‌ డబ్బుల గురించి మాట్లాడటంతో దర్యాప్తు అధికారులు అవాక్కయ్యారు. అతన్ని రాష్ట్ర పోలీసులకు అప్పగించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

delhi blast explosives storage Haryana Maulvi Investigation Istiak Latest News in Telugu radicalized doctors social media recruitment Terror attack white-collar terror network

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.