ఢిల్లీ ఎర్రకోట పేలుడు (Delhi Blast) ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో, దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో దొరికిన నలుగురు ఉగ్రవాదులు టెలిగ్రామ్‌లో కోడ్ భాషలో (code language) మాట్లాడుకునేవారని ఎన్‌ఐఏ దర్యాప్తులో బయటపడింది. నిఘా సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు, వారు ‘బిర్యానీ’,(Biryani) ‘దావత్’ వంటి పదాలను కోడ్‌నేమ్‌లుగా ఉపయోగించారని తెలిసింది. టెలిగ్రామ్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది కాబట్టి, ఉగ్రవాదులు తమ సంభాషణలు దొరక్కుండా జాగ్రత్తపడ్డారు.
Read Also: Pending bills: రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం పై సుప్రీం సంచలన తీర్పు
కోడ్‌నేమ్‌ల అర్థాలు
ఉగ్రవాదులు ఉపయోగించిన ఈ కోడ్‌నేమ్‌లకు ఉన్న అర్థాలు:
- బిర్యానీ: పేలుడు పదార్థం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ‘బిర్యానీ’ అని చెప్పేవారు.
- దావత్: ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమం (దాడి) గురించి మాట్లాడాల్సి వస్తే ‘దావత్’ అని చెప్పుకునేవారు.
- దావత్ కోసం బిర్యానీ వండాం: పేలుడు పదార్థం సిద్ధం అయిందని చెప్పేందుకు ఈ వాక్యాన్ని ఉపయోగించేవారు.
ఈ కోడ్‌నేమ్‌లు ఉపయోగించినప్పటికీ హైదరాబాద్, తెలంగాణకు సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం దొరకలేదు.
సూత్రధారి, నెట్‌వర్క్ వివరాలు
ఈ ఉగ్ర ముఠాకు సూత్రధారి జమ్మూకాశ్మీర్‌లోని (Jammu and Kashmir) సోఫియా జిల్లాకు చెందిన ఇమామ్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ ఎర్రకోటలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీని, (Umar Nabini) అహ్మద్ 2020లో తన కుమారుడి చికిత్స కోసం కలిశాడు. అనంతరం నబీని ఉగ్రవాద భావజాలంతో ర్యాడికలైజ్ చేశాడు. ఆ తర్వాత డాక్టర్ నబీ ఉగ్ర కార్యకలాపాలను చేయగలిగే డాక్టర్లను గుర్తించి, వారిని అహ్మద్ దగ్గరికి తీసుకెళ్లేవాడు. అలాంటి వారందరికీ అహ్మద్ టెలిగ్రామ్‌లో ఉగ్రవాదం గురించి బ్రెయిన్ వాష్ చేసేవాడు.
దర్యాప్తు సంస్థల వివరాల ప్రకారం.. అహ్మద్ ఉగ్రవాదులుగా మార్చిన వాళ్లంతా కాశ్మీర్‌లో ఒక చోట పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ఉగ్రవాదులతో కలిశారు. ఈ సమావేశంలో కొత్త ఉగ్రవాదులకు రెండు ఏకే సిరీస్ రైఫిల్స్ ఇచ్చారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: