భారతదేశంలోనే ఉంటూ భారతీయులకు సాయం చేయాల్సింది పోయి, దేశ ప్రజలను హతమార్చేందుకు ఉగ్రముఠాలో చేతులు కలుపుతున్నారు కొద్దిమంది భారతీయ ముస్లింలు. మతం పేరుతో మారణహోమానికి పాల్పడేవారికి ఎలాంటి శిక్ష విధించినా తక్కువే. పొరుగుదేశమైన పాక్ లోని ఉగ్రవాదులతో చేతులు కలిపి, భారీ జననష్టానికి కుట్రపడిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఢిల్లీ (Delhi) కారు పేలుడు (Delhi blast) ఘటన. ఈ కారు బాంబు పేలుడు కేసులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి.
Read Also: Chhattisgarh: బీజాపూర్ లో 41 మంది మావోయిస్టుల లొంగుబాటు
నిందితురాలు డాక్టర్ షాహిన్ షషిద్ (Shaheen Shahid) గర్ల్ ఫ్రెండ్ కాదని, తన భార్య అని సహ నిందితుడు ముజమ్మల్ షకీల్ విచారణలో వెల్లడించారు. 2023లో తమ నిఖా జరిగిందని చెప్పాడు. అల్-ఫలా యూనివర్సిటీ సమీపంలో మతపరమైన ప్రదేశం అందుకు వేదికైందని తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు అధికారులను ఉటంకిస్తూ జాతీయా మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2023లో ఆయుధాలు కొనేందుకు ముజమ్మిల్ కు షాహిన్ రూ. 6.5 లక్షలు ఇచ్చిందని, 2024లో బాంబర్ ఉమర్ నబీకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కొనేందుకు రూ. 3లక్షలు ఇచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు.
జైషే మహిళా విభాగంలో షాహిన్ కీలక పాత్ర
భారత్ ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ఆ ఉగ్ర సంస్థకు చెందిన ప్రధాన కేంద్రం కూడా ధ్వంసమైంది. ఈ క్రమంలో జైషే మహిళా బ్రిగేడ్ ల ఏర్పాటుకు ఆన్ లైన్ కోర్సులు ప్రారంభించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ జమాత్ ఉల్ మొమినాత్ విభాగానికి మసూద్ సోదరి సాదియా అజార్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ విభాగంలో షాహిన్ కు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: