ఢిల్లీ కారు పేలుడు (Delhi Blast) ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్ ఐఎ తనిఖీలను ముమ్మరం చేసింది. భారీగా ప్రానష్టానికి కుట్రపడ్డ టెర్రరిస్టుల (Terrorists) పన్నాగాన్ని భారత నిఘాసంస్థ బట్టబయలు చేసింది. దీంతో పలువురిని ఎన్ ఐఎ అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా శ్రీనగర్, జమ్మూ ప్రాంతాల్లో నలుగురు ప్రధాన అనుమానితులను ఎన్ ఐఎ అరెస్టు చేసింది. అదేసమయంలో జమ్మూ కాశ్మీర్ లోని కశ్మీర్ టైమ్స్ మీడియా సంస్థ కార్యాలయంలో తూటాలు లభ్యం కావడం కలకలం రేపుతోంది.
Read Also: Kurnool: బైక్ ఇవ్వలేదని పోలీస్ జీపునే ఇంటికి తీసుకెళ్లిన మందుబాబు
ఎన్ ఐఎ అధికారులు దేశవ్యాప్తంగా జల్లెడ
ఈనెల 10న జరిగిన ఢిల్లీ కారు పేలుడు ఘటనతో ఎన్ ఐఎ అధికారులు దేశవ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. ఉగ్రలింకుల ఆధారంగా ఎక్కడికక్కడ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో నలుగురు ప్రధాన అనుమానితులను ఎన్ ఐఎ అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయినవారి సంఖ్య ఆరుకు చేరింది. వీళ్లందర్నీ శ్రీనగర్, జమ్ములో అదుపులోకి తీసుకోగా.. అక్కడి నుంచి తీసుకొచ్చి ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టారు.
కస్టడీకి అప్పగించడంతో ఎన్ ఐఎ ప్రధాన కార్యాలయానికి తరలించారు. జమ్మూకశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్నీ జరిపిన సోదాల్లో జమ్మూలోని కశ్మీర్ టైమ్స్ ఆఫీసులో ఏకే-47 బుల్లెట్లు దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. క్యాట్రిడ్జ్లు, పిస్టల్ రౌండ్స్, మూడు గ్రనేడ్ లెవర్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనూరాధ భాసిన్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.
వేర్పాటువాదానికి మద్దతు ఇస్తున్న అనురాధ భాసిన్
భారతదేశం, జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) కేంద్రపాలిత ప్రాంతానికి వ్యతిరేకంగా, వేర్పాటువాదానికి అనుకూల సమూచారాన్ని ఆమె వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతోనే సోదాలు చేసినట్లు చెప్పారు. ఆమె కార్యకలాపాలు, సంబంధాలను పరిశీలించడమే దర్యాప్తు లక్ష్యమన్నారు. ఇక కశ్మీర్ టైమ్స్ జమ్మూకశీర్ కు చెందిన ప్రముఖ దినపత్రిక కాగా.. ఆ సంస్థలో సోదాలపై కశ్మీర్ టైమ్స్ సీనియర్ ఎడిటర్లు ఫైర్ అవుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: