Delhi Blast వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనది. అంతేకాదు వైద్యులపై సమాజంలో కూడా ఉన్నత గౌరవం ఉంది. డాక్టరే దేవుడిగా భావిస్తారు. తమ ప్రాణాలను కాపాడే వైద్యులపై రోగులు ఎంతో భక్తిభావాన్ని, గౌరవాన్ని చూపిస్తారు. ఓ రోగి డాక్టర్ వద్దకు వెళ్లగానే తన రోగం మాయమైపోయిందని భావిస్తాడు. వైద్యులపై ఆపారమైన విశ్వాసానికి ఇది నిదర్శనం. ఎందుకంటే వైద్యులు రోగుల ప్రాణాలను కాపాడుతారు. కానీ కొందరు తమ పవిత్రమైన వృత్తిని మతం ముసుగులో ఉగ్రవాదులగా మారుతున్నారు. వారు ఎవరో మీకు ఈపాటికే తెలిసి ఉంటుంది. పాక్(Pak) ఉగ్రవాద(Pakistan terrorism) సంస్థతో చేతులు కలిపి తమ పవిత్రమైన వృత్తిని అపవిత్రం చేసుకున్నారు. పైకి వైట్-కాలర్గా ఉంటూ ఉగ్రచర్యలకు పాల్పడ్డారు. దేశంలో భారీగా ప్రజల ప్రాణాలను తీసేందుకు ప్రణాళికను రూపొందించారు.
Read Also: Sathya Sai Baba: శతజయంతి ఉత్సవాలకు సర్వం సిద్ధం
దీంతో ఈ నలుగురికి మెడికల్ కమిషన్ ఊహించని షాక్ ఇచ్చింది.
మెడికల్ రిజిస్ట్రేషన్లను(Medical registrations) రద్దు చేసిన ఎన్ ఎంసి దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యుల్ (టెర్రిస్టుల)తో సంబంధం ఉన్న నలుగురు వైద్యులపై నేషనల్ మెడికల్ కమిషఆన్ (ఎన్ఎంసి) కఠిన చర్యలు తీసుకుంది. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) కింద ఎఫ్ ఐఆర్ లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, ఇండియాలో వైద్య వృత్తిని నిర్వహించకుండా నిషేధం విధించింది. ఎన్ ఎంసీ ఆదేశాల మేరకు, ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లు ఈ నలుగురు డాక్టర్ల పేర్లను ఇండియన్, నేషనల్ మెడికల్ రిజిస్టర్ల నుంచి తక్షణమే తొలగించాయి.
వారు ఎవరు అనగా..
డాక్టర్ ముజఫర్ అహ్మద్, డాక్టర్ అదీల్ అహ్మద్ రథర్, డాక్టర్ ముజామిల్ షకీల్, డాక్టర్ షాహీన్ సాహిద్ ఈ నలుగురు వైద్యులు ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసుతో సంబంధం కలిగి ఉన్నట్లు ఎన్ ఎంసీ తన ఉత్తర్వుల్లో పేరొడింది. ఈ డాక్టర్లంతా పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ అయిన జైష్-ఎ-మొహమ్మద్ వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్ లో భాగమని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ప్రస్తుతం పోలీసు కట్టడీలో ఉన్న ఈ నలుగురు డాక్టర్లు, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వైద్యవృత్తిని నిర్హించడానికి లేదా ఏదైనా వైద్య నియామకంలో కొనసాగడానికి పూర్తిగా అనర్హులు అని ఎన్ ఎంసీ స్పష్టం చేసింది. ఈ చర్య ఉగ్రవాద కార్యకలాపాల్లో నిమగ్నమైన ఉన్నత విద్యావంతులైన నిపుణులపై ప్రభుత్వం తీసుకున్న అత్యంత కఠినమైన చర్యగా పరిగణిస్తున్నారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, బాంబు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: