📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Delhi Blast: తన మాజీ భార్య డాక్టర్ షహీన్ పై భర్త కీలక ఆరోపణ

Author Icon By Tejaswini Y
Updated: November 13, 2025 • 5:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Delhi Blast: ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటన దర్యాప్తు లోతుగా సాగుతుండగా, విచారణ సంస్థలు అనేక ఆశ్చర్యకర విషయాలను వెలికి తీస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా వైట్‌కాలర్ ఉద్యోగాల ముసుగులో ఉగ్రవాద చర్యలను నడిపిన వారిని గుర్తించడం విచారణలో కీలక మలుపుగా మారింది. ఈ నేపధ్యంలో, పాకిస్తాన్ ఆధారిత జైష్-ఇ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా వైద్యురాలు డాక్టర్ షహీన్ సయీద్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈమె గురించి పలు ఆసక్తికర వివరాలను ఆమె మాజీ భర్త డాక్టర్ జాఫర్ హయాత్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కాన్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో కంటి వైద్యునిగా పనిచేస్తున్నారు.

Read Also:  Jubilee Hills: ఓటు వేయలేదా మా డబ్బు వెనక్కి ఇచ్చేయండి

డాక్టర్ జాఫర్ హయాత్

పోలీసు విచారణలో డాక్టర్ జాఫర్ హయాత్ వెల్లడించిన వివరాల ప్రకారం, షహీన్ విలాసవంతమైన జీవితం గడపాలని, ఆస్ట్రేలియా లేదా యూరప్ దేశాలకు వెళ్లి స్థిరపడాలని తరచూ ఒత్తిడి చేసేదని తెలిపారు. అయితే, తాను భారత్‌ను వదిలి వెళ్లడాన్ని అంగీకరించలేదని చెప్పారు. వారు 2013లో పరస్పర అంగీకారంతో విడిపోయారని, ఇద్దరు పిల్లలు తన వద్దే ఉన్నారని తెలిపారు. షహీన్ ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొంటుందని తానెప్పుడూ ఊహించలేదని డాక్టర్ జాఫర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కాన్‌పూర్ మెడికల్ కాలేజీలో ఫార్మకాలజీ విభాగంలో పనిచేస్తున్నప్పుడు చాలా ఆకాంక్షతో, విజయంపై దృష్టి పెట్టి జీవించేదని వివరించారు. విడాకుల తరువాత ఆమెతో సంబంధం లేకపోయినప్పటికీ, ఈ పరిణామం తనకు తీవ్ర షాక్‌గా అనిపించిందన్నారు.

ఇదిలా ఉండగా, ఢిల్లీలో పేలుడు(Delhi Blast) సంభవించే కొన్ని గంటల ముందే జమ్మూ-కాశ్మీర్ పోలీసులు ఫరీదాబాద్‌లో షహీన్‌ను అరెస్టు చేశారు. ఆమె కారులో ఏకే-47 తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో జైష్-ఇ-మొహమ్మద్ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడంలో షహీన్ కీలక పాత్ర పోషించిందని, ఆ సంస్థ అధినేత మసూద్ అజార్ సోదరి ఆధ్వర్యంలో ఆమె పనిచేస్తోందని విచారణలో తేలింది. ఇక, పోలీసులు ఆమె సోదరుడు డాక్టర్ పర్వేజ్ అన్సారీని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. లక్నోలోని కాంధారీ బజార్‌లో ఉన్న వారి నివాసంలో సోదాలు జరిపినా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులను కూడా విచారించి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది.

ఫరీదాబాద్‌లోని అల్-ఫల్హా స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో షహీన్‌తో పాటు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనాయ్, డాక్టర్ ఉమర్ నబీ కూడా పనిచేస్తున్నారని అధికారులు గుర్తించారు. వీరిలో డాక్టర్ ఉమర్ నబీ ఢిల్లీ బ్లాస్ట్‌కు ప్రధాన పన్నాగకర్తగా ఉన్నాడని, పేలుడులో ప్రాణాలు కోల్పోయినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి.

ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్రవాద కుట్ర ఉందని భావిస్తున్నారా?

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Delhi Car Blast Dr Shaheen Sayeed Kashmir terror connection Latest News in Telugu Masood Azhar sister Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.