📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Delhi Blast: ఆవును దేశవ్యాప్త పేలుళ్లకు ప్రణాళిక చేశాం: ముజమ్మిల్

Author Icon By Sushmitha
Updated: November 22, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తీగలాగితే డొండ కదిలినట్లుగా ఓ బాంబుపేలుడు (Delhi Blast) ఘటన పెద్ద కుట్ర నుంచి దేశాన్ని కాపాడింది. లేకపోతే దేశ వ్యాప్తంగా వేలాదిమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఉగ్రవాదులు ఎంతగా తెగిస్తున్నారు అంటే తమ వైద్యవృత్తినే పణంగా పెట్టేలా వైద్యులను తమవైపుకు తిప్పుకుంటున్నారు. ఇందులో భాగమే జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) అల్-ఫలాహ్ వర్సిటీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అనేక విషయాలు రాబట్టారు. ఇక కుట్ర వెనుక ఎవరున్నది అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఇక టెర్రర్ మాడ్యూల్ ప్రకారం అల్-ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన ఉగ్ర డాక్టర్ల బృందం కుట్ర పన్నినట్లుగా తేలింది. 

Read Also: CRDA meeting: భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చెయ్యం: నారాయణ 

Delhi Blast Cow was planned for nationwide blasts: Muzammil

ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది

జైషే ఉగ్రసంస్థ ఆదేశాలతో దేశవ్యాప్త పేలుళ్లకు ప్రణాళిక రచించినట్లుగా దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్న అధికారులు ఇప్పటికే డాక్టర్లు షాహీనా, ముజమ్మిల్ తోపాటు దేశవ్యాప్తంగా అనేక చోట్ల నుంచి పలువురు అనుమానితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ముజమ్మిల్ ఇంట్లో పెద్ద ఎత్తున 2,900కిలోల అమ్మోనియం నైట్రేట్ దొరికింది. 

అలాగే దేశవ్యాప్తంగా పేలుళ్లు ఎలా జరపాలన్న దానిపై షాహీనా ప్రణాళికలు రచించినట్లుగా అధికారులు కనిపెట్టారు. ముజమ్మిల్ ను విచారించగా అనేక కీలక విషయాలను రాబట్టినట్లుగా తెలుస్తోంది. దేశ వ్యాప్త పేలుళ్లకు కుట్రపన్నినట్లుగా ముజమ్మిల్ నేరాన్ని అంగీకరించినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. 2023లోనే ఈ ప్రణాళిక వేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్యాప్తు వర్గాలకు ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

పేలుళ్ల ప్రణాళిక ఎవరిపై జరిగింది?

దేశవ్యాప్తంగా పేలుళ్లు నిర్వహించడానికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.

పేలుళ్ల ప్రణాళిక చేసిన వ్యక్తి ఎవరు?

ముజమ్మిల్ అనే ఉగ్రవాది ఈ ప్రణాళిక చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Counter-Terrorism delhi blast Google News in Telugu Latest News in Telugu Muzammil confession nationwide attacks NIA Investigation security threat. Telugu News Today terrorist plot

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.