Ansar Interim terror group : దేశాన్ని కలవరపరిచిన ఢిల్లీ ఉగ్ర పేలుడు కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేలుళ్లకు కుట్ర పన్నిన డాక్టర్ల బృందం కలిసి “అన్సార్ ఇంటీరియం” పేరుతో ఒక ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ కేసును ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారిస్తోంది.
దర్యాప్తు ప్రకారం ప్రధాన నిందితులు ముజమ్మిల్ గన్నీ, ఉమర్ నబీ, ఆదిల్, మౌల్వీ ఇర్ఫాన్, కారీ ఆమిర్, తౌఫిల్ గాజీ తదితరులు 2022 ఏప్రిల్‌లో శ్రీనగర్‌లో సమావేశమై ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. సంస్థకు ఆదిల్‌ను నాయకుడిగా, మౌల్వీ ఇర్ఫాన్‌ను ఉపనాయకుడిగా నియమించి, ఇతర సభ్యులకు వేర్వేరు బాధ్యతలను కేటాయించారు. ఉమర్ సమన్వయ బాధ్యతలు చేపట్టగా, గన్నీ ఆర్థిక వ్యవహారాలు మరియు సరఫరాలను పర్యవేక్షించినట్లు విచారణలో తేలింది.
Read Also: Mahesh Babu: ‘నాగబంధం’ టీజర్ లాంచ్ చేసిన సూపర్‌స్టార్
వారు పేలుళ్లకు అవసరమైన సామగ్రిని దశలవారీగా సమకూర్చుకున్నారు. 2023లో సోహ్న ప్రాంతం నుంచి ఎరువులు కొనుగోలు చేసి, ఫరీదాబాద్‌లోని ఒక కెమికల్ దుకాణం నుంచి పొటాషియం నైట్రేట్ తెప్పించినట్లు సమాచారం. ఐఈడీలు తయారు చేయడంపై అనుభవం లేకపోయినా, ఉమర్ ఆన్‌లైన్ వీడియోల ద్వారా విధానాలను నేర్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
దర్యాప్తు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఉమర్ అత్యంత ర్యాడికలైజ్డ్ వ్యక్తిగా గుర్తించబడ్డాడు. ఢిల్లీలో రద్దీ ప్రదేశాలు లేదా ముఖ్య ప్రార్థనా మందిరాల వద్ద కారుబాంబు పేల్చాలని కుట్రపన్నినట్లు సమాచారం. అయితే శ్రీనగర్ పోలీసులు ఈ నెట్వర్క్‌ను ఛేదించడంతో అతను తీవ్ర ఒత్తిడికి గురై చివరికి పేలుడు ఘటనకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇతడు గతంలో కూడా ఉగ్ర సంస్థల్లో చేరేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తేలింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: