हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Delhi Blast: బిర్యానీ కోడ్ ఉపయోగించి బాంబుల తయారీ

Tejaswini Y
Delhi Blast: బిర్యానీ కోడ్ ఉపయోగించి బాంబుల తయారీ

ఢిల్లీ(Delhi Blast)లో ఎర్రకోట దగ్గర జరిగిన పేలుళ్లలో 15 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దర్యాప్తు వేగం పెరిగింది. ఈ కేసులో కొత్తగా బయటపడుతున్న వివరాలు విచారణాధికారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఉగ్రకుట్రలో పాల్గొన్న డాక్టర్ల గుంపుకు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ హ్యాండ్లర్ ‘హంజుల్లా’ ఆన్‌లైన్ ద్వారా బాంబుల తయారీపై మార్గదర్శకత్వం ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. నిందితుల్లో ఒకరైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌కు ఈ హంజుల్లా పేలుడు పదార్థాల తయారీ వీడియోలు కూడా పంపినట్లు విచారణలో తేలింది. ‘హంజుల్లా’ అనే పేరు నిజానికి ఒక మారుపేరు మాత్రమే అని భావిస్తున్నారు.

Read Also: OTT: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సీజ‌న్ 3, ‘బైసన్’

బాంబులను ‘బిర్యానీ’, దాడులను ‘దావత్’ పేర్లతో

జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్‌కు చెందిన మత గురువు మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్‌ ద్వారా షకీల్ మొదటిసారి ఈ నెట్‌వర్క్‌తో కలిసినట్లు అధికారులు వెల్లడించారు. షకీల్‌ను రాడికలైజ్ చేసిన అనంతరం, ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీ(Al-Fala University)లో పనిచేస్తున్న ఇతర వైద్యులను కూడా కుట్రలోకి తీసుకొచ్చేందుకు మౌల్వీ సహకరించాడు. పేలుడు పదార్థాల రవాణా నుంచి ఆత్మాహుతి దాడిలో వినియోగించిన హ్యుందాయ్ ఐ20 వాహనం ఉగ్రవాది ఉమర్ మహ్మద్‌కు చేరే వరకు షకీల్ ముఖ్య పాత్ర పోషించినట్లు ఆరోపిస్తున్నారు.

దర్యాప్తులను తప్పుదారి పట్టించేందుకు ఈ ముఠా టెలిగ్రామ్‌లో ప్రత్యేక కోడ్ పదాలను ఉపయోగించినట్లు వెల్లడైంది. బాంబులను ‘బిర్యానీ’, దాడులను ‘దావత్’ పేర్లతో గుర్తిస్తూ తమ అంతర్గత కమ్యూనికేషన్ కొనసాగించారు. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలోని కీలక స్థలాలను లక్ష్యంగా చేసుకొని 200 శక్తివంతమైన పేలుడు పరికరాలు సిద్ధం చేసినట్లు సమాచారం.

ఈ కుట్రకు కేంద్ర బిందువుగా ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీ పనిచేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈడీ అధికారులు టెర్రర్ ఫండింగ్, మనీలాండరింగ్ ఆరోపణల పై యూనివర్సిటీ వ్యవస్థాపకుడు జావేద్ అహ్మద్ సిద్ధిఖీని అరెస్ట్ చేశారు. యూనివర్సిటీకి చెందిన 25 ప్రదేశాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.48 లక్షలు, కీలక డాక్యుమెంట్‌లు స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీ కార్యకలాపాలను మరింత లోతుగా పరిశీలించేందుకు ఫరీదాబాద్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870