ఢిల్లీలోని(Delhi Blast) ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర పేలుడు దేశమంతటా ఆందోళన కలిగించింది. క్షణాల్లోనే ప్రాణ నష్టం సంభవించడంతో భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. దాడి వెనుక ఉగ్రవాద కోణం ఉన్నట్లు విచారణలో బయటపడుతోంది. 26/11 ముంబై దాడులను తలపించే విధంగా రాజధానిలో వరుస బాంబు పేలుళ్లు జరగాలని ఉగ్రవాదులు పన్నిన పన్నాగం విఫలమైందని పోలీసులు భావిస్తున్నారు. ఈ దాడుల్లో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్, ఇతర ప్రముఖ ప్రదేశాలు కూడా టార్గెట్‌లో ఉన్నట్లు జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి.
Read Also: AyyappaMala: అయ్యప్ప మాల ఎవరు ధరించకూడదో తెలుసా?
ఈ దర్యాప్తు మధ్య మరో ముఖ్యమైన మలుపు బయటపడింది. ఉగ్రమూకలు పేలుడు ఘటనలో ఉపయోగించిన కారుతో పాటు మరో వాహనం కూడా అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ కారు ఎవరిది? ఎక్కడ ఉందన్న కోణంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆ వాహనం ఫోర్డు కారు (నంబర్ DL 10 CK 0458) కాగా, అది డాక్టర్ ఉమర్ పేరిట నమోదైందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆ కారును కనుగొనేందుకు జమ్మూకశ్మీర్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో శోధన కొనసాగుతోంది. కారు ఆచూకీ దొరకగానే కేసులో కీలకమైన వివరాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అన్ని పోలీస్ స్టేషన్లు, నిఘా విభాగాలు అప్రమత్తంగా ఉన్నాయని సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: