📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest news: Delhi blast: అల్ ఫలాహ్‌ యూనివర్సిటీ  చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Author Icon By Saritha
Updated: November 20, 2025 • 3:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెర్రర్ ఫండింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీలో(Delhi blast) ఉన్న అల్ ఫలాహ్‌ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు జావేద్ అహ్మద్ సిద్ధిఖీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే 13 రోజుల ఈడీ కస్టడీలో ఉన్న ఆయనపై తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రూ.2 కోట్ల మోసం కేసు నమోదైంది. దీంతో ఆయన అక్రమాల చిట్టా మరింత పెరుగుతోంది.

యూనివర్సిటీకి నకిలీ అక్రిడిటేషన్లు ఉన్నప్పటికీ, చట్టబద్ధమైన గుర్తింపు ఉన్నట్లుగా తప్పుడు ప్రచారం చేసి, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి సిద్ధిఖీ రూ.415.10 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఢిల్లీ బ్లాస్ట్ కేసుతో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఈ ఆరోపణలపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఆయన్ను ఆదివారం అరెస్ట్ చేసి, డిసెంబర్ 1 వరకు కస్టడీకి తీసుకుంది.

Read also: ముఖ సౌందర్యానికి ఈ సుగంధ ద్రవ్యాలను రాస్తున్నారా..?

The noose tightening around Al Falah University

భోపాల్‌లో కొత్త చీట్ ఫండ్ కేసు

జావేద్ అహ్మద్(Delhi blast) సిద్ధిఖీపై ప్రస్తుతం భోపాల్‌లో నమోదైన కొత్త కేసు 24 ఏళ్ల క్రితం నాటిది. 1997-2001 మధ్య కాలంలో సిద్ధిఖీ, అతని సోదరుడు హమూద్ సిద్ధిఖీ ఒక చిట్ ఫండ్ కంపెనీని నడిపి, డబ్బు రెట్టింపు చేస్తామని ప్రజల నుంచి భారీగా వసూలు చేసి మోసం చేశారని పోలీసులు తెలిపారు. గ్యాస్ బాధితులకు చెందిన నిధులను కూడా వారు స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, దర్యాప్తు వేగవంతం కావడంతో మధ్యప్రదేశ్‌లోని మో కంటోన్మెంట్ బోర్డు అధికారులు సిద్ధిఖీ పూర్వీకుల ఇంటిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు సమయంలో యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్లు, ఫీజుల రికార్డులను సిద్ధిఖీ మార్చే అవకాశం ఉందని ఈడీ న్యాయస్థానంలో వాదించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Al Falah University ED Custody fake accreditation Javed Siddiqui Money Laundering Terror Funding

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.