📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Latest Telugu News : Air Pollution : నగరాన్ని వీడి హిల్‌ స్టేట్‌కు క్యూకడుతున్న ఢిల్లీ వాసులు?

Author Icon By Sudha
Updated: December 17, 2025 • 3:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరస్థాయికి (Air Pollution) చేరింది. గాలి నాణ్యత సూచిక అధ్వానస్థాయిలో నమోదవుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ లెవెల్స్‌ 400కుపైనే నమోదవుతున్నాయి. కాలుష్యానికి తోడు నగరాన్ని దట్టమైన పొగ కమ్మేస్తోంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, పిల్లలు, శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఉన్న వారు అనారోగ్యానికి గురవుతున్నారు. కాలుష్యం (Air Pollution) తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో నగర వాసులు తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ వాహనాలు సమీపంలోని హిల్‌స్టేట్‌ హిమాచల్‌ ప్రదేశ్‌కు క్యూ కట్టాయి. రోహ్తాంగ్‌ పాస్‌ సమీపంలో వాహనాల రద్దీ కనిపించింది. వందలాది కార్లు రోహ్తాంగ్‌ రహదారిపై నిలిచిపోయిన దృష్యాలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. రద్దీ అధికంగా ఉండటంతో వాహనాలు ముందుకు కదలకుండా రోడ్డుపై నిలిచిపోయినట్లుగా కనిపిస్తోంది.

Read Also: India: రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

Air Pollution

‘విషపూరిత గాలి నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ వాసులు నగరాన్ని వీడి ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు’, ‘కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి కాకపోతే మరేంటి..? ఇది ఏ నగరంలోని రోడ్డు కాదు. ఇది రోహ్తాంగ్‌ పాస్‌. అక్కడ ప్రస్తుతం ఎలాంటి స్నో లేదు. హాలిడేస్‌ లేవు. అయినా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అందరూ ఎందుకు ఈ ప్రాంతానికి క్యూ కడుతున్నారు..?’ అంటూ ఈ వీడియోలను నెటిజన్లు తెగ వైరల్‌ చేస్తున్నారు.

వాయు కాలుష్యం అంటే ఏమిటి?

వాయు కాలుష్యం అంటే అంతర్గత లేదా బాహ్య గాలిని దాని సహజ లక్షణాలను సవరించే వాయువులు మరియు ఘనపదార్థాల ద్వారా కలుషితం చేయడం . ఆరోగ్యానికి హానికరమైన ముఖ్యమైన కాలుష్య కారకాలలో కణ పదార్థం (PM2. 5 మరియు PM10) 1, కార్బన్ మోనాక్సైడ్ (CO), ఓజోన్ (O3), నల్ల కార్బన్ (BC), సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు (NOx) ఉన్నాయి.

భారతదేశంలో వాయు కాలుష్యానికి కారణాలు ఏమిటి?

భారతదేశంలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు పారిశ్రామిక మరియు వాహన ఉద్గారాలు, నిర్మాణ ధూళి మరియు శిధిలాలు, విద్యుత్ కోసం థర్మల్ విద్యుత్‌పై ఆధారపడటం, వ్యర్థాలను కాల్చడం మరియు తక్కువ ఆదాయ మరియు గ్రామీణ కుటుంబాలు వంట మరియు వేడి చేయడానికి కలప మరియు పేడను ఉపయోగించడం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

air quality crisis Breaking News Delhi Air Pollution Delhi residents hill states latest news migration Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.