हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest news: Delhi Acid: కన్నా తండ్రే కూతురు పై యాసిడ్ నాటకం చివరికి కటకటాల పాలు  

Saritha
Latest news: Delhi Acid: కన్నా తండ్రే కూతురు పై యాసిడ్ నాటకం చివరికి కటకటాల పాలు      

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన యాసిడ్ దాడి(Delhi Acid) ఘటనలో పోలీసులు ఆశ్చర్యకర విషయాన్ని వెలికి తీశారు. బాధితురాలే అనుకున్న యువతి తండ్రి ఈ మొత్తం నాటకానికి సూత్రధారి అని పోలీసులు నిర్ధారించారు. 20 ఏళ్ల విశ్వవిద్యాలయ విద్యార్థినిపై జరిగిన దాడి వెనుక నిజం వెలుగులోకి రాగానే, నిందితుడైన తండ్రి అకిల్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తనపై నమోదైన అత్యాచారం కేసు నుంచి తప్పించుకోవడానికి అకిల్ ఖాన్ ఈ ప్రణాళిక రచించాడు. ప్రత్యర్థి జితేందర్‌ను ఇరికించేందుకు తన కుమార్తె సహకారంతో యాసిడ్ దాడి డ్రామా సృష్టించినట్టు విచారణలో తేలింది.

Read also: విషాదంగా మారిన పండుగ ఆనందం..ముగ్గురు చిన్నారులు మృతి

Delhi Acid
Delhi Acid: కన్నా తండ్రే కూతురు పై యాసిడ్ నాటకం చివరికి కటకటాల పాలు

నాటకం వెనుక అసలు ఉద్దేశం

పోలీసుల వివరాల ప్రకారం, జితేందర్ భార్య అక్టోబర్ 24న అకిల్ ఖాన్‌పై అత్యాచారం(Delhi Acid) కేసు నమోదు చేయడంతో పరిస్థితి మారింది. 2021–2024 మధ్య కాలంలో తన ఫ్యాక్టరీలో పని చేసిన ఆ మహిళపై లైంగిక వేధింపులు చేసి, అభ్యంతరకర ఫోటోలు, వీడియోలతో బెదిరించాడని ఆమె ఆరోపించింది. ఈ కేసు నుంచి బయటపడేందుకు అకిల్ తన కుమార్తెతో కలిసి యాసిడ్ దాడి ఘటనను సృష్టించాడు.

దీని కోసం టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్‌ను కొనుగోలు చేసి, దాడి జరిగినట్లుగా చిత్రీకరించారు. బాధితురాలు పోలీసులకు జితేందర్, ఇషాన్, అర్మాన్‌లు బైక్‌పై వచ్చి దాడి చేశారని తెలిపినా, సీసీటీవీ ఫుటేజీ విశ్లేషణలో ఆ ముగ్గురు ఘటన సమయంలో కరోల్ బాగ్ ప్రాంతంలో ఉన్నట్లు తేలింది. దాంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారణను లోతుగా జరపగా, అకిల్ ఖాన్ నేరాన్ని ఒప్పుకున్నాడు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870