📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Delhi: గుంతలో పడి యువకుడి మృతి

Author Icon By Saritha
Updated: February 7, 2026 • 11:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమ ఢిల్లీలోని (Delhi)) ఓ సాధారణ మధ్యతరగతి ఇంట్లో ఆ రాత్రి ఆనందానికి బదులు విషాదం అలుముకుంది. ఇంటికి చేరాల్సిన యువకుడు దురదృష్టవశాత్తూ తిరిగి రాలేదు. కొన్ని నిమిషాల్లో కలవాల్సిన కుటుంబం, ఇక ఎప్పటికీ ఆ ఎదురుచూపుతోనే మిగిలిపోయింది.

కాల్ సెంటర్ ఉద్యోగి (Call center employee) అయిన కమల్ సరిగ్గా అర్థరాత్రి 12:50 గంటలకు తన కవల సోదరుడికి ఫోన్ చేసి తల్లికి ఇమ్మన్నాడు. అమ్మా చపాతీలు సిద్ధం చేయి, మరో 15 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను అని చెప్పాడు. కానీ ఆ 15 నిమిషాలు కాస్తా నిరంతర నిరీక్షణగా మిగిలిపోయింది. ఆ యువకుడు మరెప్పటికీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.

Read Also: Trump: భారత్​పై 25 శాతం అదనపు సుంకం రద్దు..వైట్​ హౌస్

తల్లిదండ్రుల పెళ్లి రోజు వేళా కుటుంబానికి శోకం.

కమల్ పని ముగించుకుని తన బైక్‌పై వస్తుండగా జనక్‌పురి వద్ద ఢిల్లీ (Delhi) జలమండలి తవ్విన 15 అడుగుల లోతైన గుంతలో పడి మరణించాడు. సీవరేజీ పనుల కోసం తీసిన ఈ గొయ్యి వద్ద కనీస రక్షణ చర్యలు లేకపోవడం, వీధి దీపాలు లేక ఆ ప్రాంతం అంతా చీకటిమయంగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. తన సొంత సంపాదనతో ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైకే అతడికి చిట్టచివరి ప్రయాణ సాధనమైంది.

అర్థరాత్రి దాటినా కొడుకు రాకపోవడంతో ఆ తండ్రి, సోదరుడు గాలింపు మొదలుపెట్టారు. ఆఫీసు నుంచి పోలీస్ స్టేషన్ల వరకు తెల్లవార్లూ తిరిగారు. ఉదయం వెలుగు చూశాక గొయ్యిలో పడి ఉన్న కమల్ మృతదేహాన్ని చూసి ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. “మా నాన్న రాత్రంతా వెతికారు ఉదయం తన కొడుకు శవాన్ని చూశారు” అంటూ కమల్ సోదరుడు కరణ్ కన్నీరుమున్నీరయ్యాడు.

తల్లిదండ్రుల పెళ్లి రోజు వేళా ఇలా జరగడం ఆ కుటుంబానికి తీరని శోకం. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. కనీసం బారికేడ్లు, సేఫ్టీ నెట్లు కూడా లేకుండా రహదారిని తవ్వడమే ఈ మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు ఇంజనీర్లను సస్పెండ్ చేశారు. ఒక చిన్న నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఒక ఇంటి సంతోషాన్ని చిదిమేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

call center employee Kamal last phone call Latest News in Telugu middle-class family Telugu News Tragic Incident West Delhi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.