విదేశీ ఉగ్రవాదులు భారతదేశంలోని ముస్లింలను మభ్యపెట్టి.. తమవైపుకు తిప్పుకుంటున్నారు. పేదరికం, విద్యలేనివారిని టార్గెట్ చేసుకునే ఉగ్రవాదులు ఇప్పుడు విద్యార్థులను కూడా విడిచిపెట్టడం లేదు. ఆమధ్య వైద్యులను కూడా ఉగ్రవాదులుగా మార్చి, దేశంలో పలు దాడులకు, హింసలకు యత్నించారు. చాపకింద నీరులా భారతదేశంలో ఉగ్రవాదం పెరిగిపోతున్నది. ఇది ఇలా ఉండగా ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ముస్లింలకు తీవ్రవాదభావజాలాన్ని నూరిపోసేందుకు యత్నిస్తున్నారు. (Delhi) ఈ పరిస్థితుల్లో దేశ రాజధాని ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రశ్నాపత్రం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల జరిగిన సెమిస్టర్ పరీక్షలో అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తీవ్ర ఆగ్రహా వేశాలు రగిలించింది. దీంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తం అయ్యారు. వివాదానికి కారకుడైన ప్రొఫెసర్ ను సస్పెండ్ చేశారు.
Read also: Railway Track: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు
విచారణ కమిటీ ఏర్పాటు
ఈ వారం ప్రారంభంలో యూనివర్సిటీ పరిధిలో మొదటి సెమిస్టర్ పరీక్ష జరిగింది. బీఏ సోషల్ ప్రశ్నాపత్రంలో భారతదేశంలో సామాజిక సమస్యలు’ అనే పేపర్ లో 15 మార్కుల ప్రశ్న దుమారం రేపింది. (Delhi) ‘భారతదేశంలో ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న దారుణాలను వివరించండి’ అంటూ ప్రశ్న వచ్చింది. దీంతో విద్యార్థులు అవాక్కయ్యారు. ఈ ప్రశ్నను ప్రొఫెసర్ వీరేంద్ర బాలాజీ షహరే రూపొందించారు. అయితే ఈ ప్రశ్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో యూనివర్సిటీ సరిదిద్దుకునే చర్యలకు దిగింది. దీనిపై విచారణ కమిటీ వేసింది. అంతేకాకుండా కమిటీ నివేదిక ఇచ్చేంత వరకు ప్రొఫెసర్ ను సస్పెండ్(Suspended) చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రొఫెసర్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేసే ఉద్దేశం లేదని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: