ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ (Dehradun)లో క్లౌడ్ బరస్ట్ (Clouburst) సంభవించిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఓ నదిలో పది మంది కూలీలు కొట్టుకుపోయారు.
భారీ వర్షాలకు డెహ్రాడూన్‌లో(Dehradun)ని టాన్స్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ ట్రాక్టర్ నదిలో చిక్కుకుపోయింది. వరద ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయింది. అందులోని పది మంది కూలీలు కూడా గల్లంతయ్యారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ హుటాహుటిన అక్కడికి చేరుకొని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతోంది. అయితే, వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ ఘటనలో పది మంది కూలీలు ప్రాణాలు కోల్పోయి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.
డెహ్రాడూన్ వరద పీడిత ప్రాంతమా?
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా, బాగేశ్వర్, చమోలీ, చంపావత్, డెహ్రాడూన్, నానిటాల్, పౌరీ గర్వాల్, పితోరాఘర్, రుద్రప్రయాగ్, టెహ్రీ గర్వాల్ మరియు ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలకు కూడా వరద ముప్పు ఉంది.
డెహ్రాడూన్లో నివసించడానికి సురక్షితమైన ప్రదేశం ఎక్కడ ఉంది?
డెహ్రాడూన్లో నివసించడానికి సహస్త్రధార రోడ్డు, రాజ్‌పూర్ రోడ్డు, ఇంద్ర నగర్, వసంత్ విహార్ మరియు ముస్సోరీ రోడ్డు కొన్ని ఉత్తమమైన ప్రాంతాలు.
డెహ్రాడూన్లో నీటి సమస్య ఉందా?
నగరంలో 80% కంటే ఎక్కువ బేస్‌లైన్ నీటి ఒత్తిడి (BWS) మరియు నాన్-రెవెన్యూ వాటర్ (NRW) దాదాపు 48% ఉన్నాయి . క్షీణిస్తున్న భూగర్భ జలాల పట్టికల అవసరాన్ని తీర్చడానికి తగినంత భూగర్భ జలాల రీఛార్జ్ లేకపోవడం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: