📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Shah Rukh Khan: షారూక్ ఖాన్‌పై మాజీ నార్కోటిక్స్ ఆఫీస‌ర్ ప‌రువున‌ష్టం కేసు

Author Icon By Anusha
Updated: September 25, 2025 • 4:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాజీ నార్కోటిక్స్ అధికారి సమీర్ వాంఖడే (Sameer Wankhede) కోర్ట్ ను ఆశ్రయించారు. ఆయన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ “ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్”, ప్రముఖ నటుడు షారూక్ ఖాన్ (Shahrukh Khan) పై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో ఆయన పాత్రను తప్పుడు విధంగా చూపించడం, అలాగే యాంటీ డ్రగ్ ఏజెన్సీల పనితీరును నెగటివ్‌గా చిత్రించడం వల్ల ప్రజలలో అధికార వ్యవస్థపై అవిశ్వాసం కలిగేలా చేస్తుందని వాంఖడే అభ్యంతరం వ్యక్తం చేశారు.

Dhadak 2: ఓటీటీలోకి ధ‌డ‌క్ 2 ఎప్పుడంటే.!

ఆర్య‌న్ ఖాన్ (Aryan Khan) డైరెక్ట్ చేసిన వెబ్‌సిరీస్‌లో నార్కోటిక్స్ ఆఫీస‌ర్ పాత్ర‌ను త‌ప్పుగా చూపించిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. షారూక్‌తో పాటు రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ (Red Chillies Entertainment) నుంచి వాంఖ‌డే రెండు కోట్ల న‌ష్ట‌ప‌రిహారాన్ని కోరాడు. త‌న‌కు వ‌చ్చే న‌ష్ట‌ప‌రిహారాన్ని టాటా మెమోరియ‌ల్ క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి (Tata Memorial Hospital) కి ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. ఆ వెబ్ సిరీస్‌లో యాంటీ డ్ర‌గ్ ఎన్‌పోర్స్‌మెంట్ ఏజెన్సీల‌ను నెగ‌టివ్ పాత్ర‌లో చూపించిన‌ట్లు ఆరోపించారు.

ప్ర‌జా వ్య‌వ‌స్థ‌ల‌పై విశ్వాసం కోల్పోయే రీతిలో ఆ సిరీస్ ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ద బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్‌లో స‌మీర్ వాంఖ‌డే క్యారెక్ట‌ర్‌ను ప్రేర‌ణ‌తో తీశారు.పార్టీ జ‌రుగుతున్న ప్ర‌దేశానికి వ‌చ్చిన ఆ ఆఫీస‌ర్ ఎవ‌రు డ్ర‌గ్స్ తీసుకుంటున్నారో ఆరా తీస్తాడు. సెప్టెంబ‌ర్ 18వ తేదీ నుంచి ఆ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. స‌మీర్ వాంఖ‌డే గౌర‌వానికి భంగం క‌లిగించే రీతిలో కావాల‌నే పాత్ర‌ను సృష్టించార‌ని వాంఖ‌డే త‌న స్టేట్మెంట్‌లో తెలిపారు.

Shah Rukh Khan

క్రూయిజ్ షిప్‌ను రెయిడ్ చేసిన త‌ర్వాత

స‌మీర్ వాంఖ‌డే, ఆర్య‌న్ ఖాన్‌కు చెందిన కేసు ప్ర‌స్తుతం ముంబై హైకోర్టులో ఉంద‌ని వాంఖ‌డే వాంగ్మూలం ద్వారా తెలిసింది.2021, అక్టోబ‌ర్ 3వ తేదీన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) ఆర్య‌న్ ఖాన్, అయాజ్ మ‌ర్చెంట్‌, మున్మున్ ద‌మేచాను అరెస్టు చేసింది. నిషేధిత డ్ర‌గ్స్‌ను క‌లిగి ఉన్న‌ట్లు, అమ్ముతున్న‌ట్లు కేసు బుక్ చేశారు. ఓ క్రూయిజ్ షిప్‌ను రెయిడ్ చేసిన త‌ర్వాత ఆ షిప్‌లో డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో 20 మందిని అరెస్టు చేశారు. ఆ కేసు ద‌ర్యాప్తును స‌మీర్ వాంఖ‌డే చూశాడు. ఆర్య‌న్ ఖాన్ 25 రోజుల పాటు జైలుశిక్ష అనుభ‌వించాడు. ఆ త‌ర్వాత బెయిల్ దొరికింది. 2022, మే నెల‌లో ఆర్య‌న్ ఖాన్‌పై ఉన్న కేసుల్ని కొట్టిపారేశారు. నార్కోటిక్స్ ఆఫీస‌ర్ వాంఖ‌డేను బ్లాక్‌మెయిల్ ఆరోప‌ణ‌ల కింద విధుల నుంచి తొల‌గించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Aryan Khan Director Breaking News defamation case Delhi High Court latest news Narcotics Officer Netflix series Sameer Wankhede Shahrukh Khan Telugu News The Bads of Bollywood

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.