విశాఖపట్నం నౌకాదళ (Visakhapatnam Naval Base) డాక్‌యార్డ్ ఒక చారిత్రక ఘట్టానికి వేదికైంది. భారత్ స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన మొట్టమొదటి డైవింగ్ సపోర్ట్ వెసెల్ ‘ఐఎన్ఎస్ నిస్తార్’ (‘INS Nistar’)ను భారత నౌకాదళంలోకి అధికారికంగా చేర్చారు. ఈ వేడుకకు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి హాజరయ్యారు.హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో నిర్మితమైన ఈ నౌక 10,000 టన్నుల బరువుతో, 118 మీటర్ల పొడవుతో ఉంది. ఇది ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ ప్రమాణాలకు అనుగుణంగా తయారైంది.
లోతైన సముద్రాల్లో విశేష సామర్థ్యం
ఈ వెసెల్ 300 మీటర్ల లోతు వరకు సాటురేషన్ డైవింగ్ చేయగలదు. అంతేకాదు, 1,000 మీటర్ల లోతులో రిమోట్ వెహికల్స్ ద్వారా సాల్వేజ్ పనులు చేయగలదు. అత్యవసర సమయంలో, ఇది డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్స్‌కు మదర్ షిప్‌గా పనిచేస్తుంది.ఈ నౌకలో 75 శాతం పైగా భాగాలు స్వదేశీ సంస్థల ద్వారా తయారయ్యాయి. 120కి పైగా చిన్న, మధ్య తరహా సంస్థలు దీనికి తోడ్పడ్డాయి. ఇది ఆత్మనిర్భర్ భారత్‌ను ముందుకు నడిపించే మైలురాయిగా నిలిచింది.
చారిత్రక నిస్తార్‌కు పునర్జన్మ
‘నిస్తార్’ అనే పదం సంస్కృతంలో ‘రక్షణ’ అనే అర్థాన్ని కలిగి ఉంది. 1971 యుద్ధంలో ఘాజీ సబ్‌మెరైన్‌ను గుర్తించిన నౌక పేరు ఇదే. ఇప్పుడు అదే పేరుతో కొత్త నౌక ప్రారంభమైంది.ఈ నౌకతో భారత్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సబ్‌మెరైన్ రెస్క్యూ సామర్థ్యం కలిగిన అరుదైన దేశాల జాబితాలో చేరింది. ఇది తూర్పు నౌకాదళ కమాండ్‌లో చేరబోతోంది. భారత మహాసముద్ర ప్రాంతంలో భద్రతను మరింత పటిష్ఠం చేయనుంది.
Read Also : John Prosser : యూట్యూబర్ పై దావా వేసిన ఆపిల్!