మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరం ముగియబోతోంది. డిసెంబర్ అంటే కేవలం వేడుకలు, పండుగలే కాదు.. ఆర్థికపరమైన కీలక నిర్ణయాలకు కూడా ఇదే ఆఖరి గడువు. ముఖ్యంగా ఆదాయపు పన్ను శాఖ విధించిన నిబంధనల ప్రకారం.. 2025 డిసెంబర్ 31 లోపు మీరు రెండు ముఖ్యమైన పనులను పూర్తి చేయాలి. ఒకవేళ మీరు వీటిని నిర్లక్ష్యం చేస్తే.. జరిమానాలు చెల్లించడమే కాకుండా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Read Also: Supreme Court: తాగేందుకు నీళ్లు అందించండి .. నాణ్యతపై ఆలోచిద్దాం
బిలేటెడ్ ఐటిఆర్ (Belated ITR) ఫైలింగ్
మీరు ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించి ఇప్పటి వరకు ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయలేదా? అయితే మీకు డిసెంబర్ 31, 2025 వరకే ఆఖరి అవకాశం. లేకపోతే మీరు లేట్ ఫీజ్ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉంటే.. రూ. 1,000 ఫైన్ కట్టాలి. అలాగే ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే.. రూ. 5,000 వరకు పెనాల్టీ ఉంటుంది. డిసెంబర్ 31 తర్వాత మీకు రిటర్న్స్ దాఖలు చేసే అవకాశం అస్సలు ఉండదు. మీకు రావాల్సిన ట్యాక్స్ రీఫండ్ నిలిచిపోతుంది. ట్యాక్స్ బకాయిలపై అదనంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. భవిష్యత్తులో లోన్లు తీసుకోవాలన్నా, వీసా అప్లై చేయాలన్నా ఐటిఆర్ లేకపోవడం పెద్ద మైనస్ అవుతుంది.
- పాన్ – ఆధార్ లింకింగ్ (PAN-Aadhaar Linking):
మీ పాన్ కార్డ్ ఇంకా ఆధార్‌తో లింక్ కాలేదా? అక్టోబర్ 1, 2024 లోపు ఆధార్ పొందిన వారందరూ తమ పాన్‌ను లింక్ చేయడం తప్పనిసరి. దీనికి కూడా డిసెంబర్ 31వ తేదీయే ఆఖరి గడువు.
లింక్ చేయకపోతే వచ్చే నష్టాలు ఇవే..
మీ పాన్ కార్డ్(Pan Card) ఇన్-యాక్టివ్ (Inactive) అయిపోతుంది. బ్యాంకింగ్ లావాదేవీలు, ఇన్వెస్ట్‌మెంట్ల లో అడ్డంకులు ఏర్పడతాయి. టీడీఎస్ (TDS) ఎక్కువ మొత్తంలో కట్ అవుతుంది.
మీరు ఇంటి వద్ద నుండే ఆన్‌లైన్ లో సులభంగా ఈ పని పూర్తి చేయవచ్చు. మీ పాన్ నెంబర్, ఆధార్ నంబర్లను ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫై చేయండి.
అవసరమైన ఫీజు చెల్లించి ప్రక్రియను పూర్తి చేయండి. లేదా, మీ రిజిస్టర్డ్ మొబైల్ నుండి 567678 నంబర్‌కు UIDPAN అని SMS పంపడం ద్వారా కూడా లింక్ చేయవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: