MP High Court security issue : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ హైకోర్టులో జరిగిన ఒక సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. రేవా జిల్లాకు చెందిన దయాశంకర్ పాండే అనే వ్యక్తి కోర్టు గదిలోకి పిండంతో ప్రవేశించి న్యాయం చేయాలని న్యాయమూర్తిని వేడుకోవడం కలకలం రేపింది.
కోర్టు గదిలో అనూహ్య ఘటన
సోమవారం జరిగిన ఈ ఘటనలో దయాశంకర్ పాండే గేట్ నంబర్-6 ద్వారా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించాడు. అనంతరం జస్టిస్ హిమాన్షు జోషి కోర్టు హాలులోకి వెళ్లి విచారణ జరుగుతున్న సమయంలో తన బ్యాగులో నుంచి పిండాన్ని తీసి న్యాయమూర్తి వేదికపై ఉంచాడు. ఇది చూసినవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
భద్రతా లోపంపై చర్యలు
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జబల్‌పూర్ ఎస్పీ సంపత్ ఉపాధ్యాయ వెంటనే చర్యలు తీసుకున్నారు. కోర్టు భద్రతలో నిర్లక్ష్యం కారణంగా ఒక అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ సహా నలుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు.
Read Also: KCR Iftar Tradition: 35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
స్థానిక పోలీసులపై ఆరోపణలు
దయాశంకర్ పాండే తన పిటిషన్‌లో గ్రామంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనపై, తన కుటుంబంపై పలుమార్లు దాడులు చేశారని ఆరోపించారు. స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఆ పిటిషన్‌పై విచారణ రోజే ఈ సంఘటన జరగడం సంచలనంగా మారింది.
Hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: