📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Dating cash offer : డేటింగ్‌కే ₹30 వేలు! పెళ్లికి లక్షలు ఇస్తున్న ప్రభుత్వం

Author Icon By Sai Kiran
Updated: December 25, 2025 • 6:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Dating cash offer : పెళ్లి చేసుకోండి.. పిల్లలు కనండి అంటూ అక్కడి ప్రభుత్వం యువతకు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తోంది. అంతేకాదు డేటింగ్‌కు వెళ్లిన జంటలకు కూడా నగదు ప్రోత్సాహం అందిస్తోంది. యువత పెళ్లి చేసుకుంటే రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తోంది. ఇలాంటి బంపర్ ఆఫర్లు ఒక్క దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో అమలులో ఉన్నాయి.

ఈ వినూత్న నిర్ణయానికి కారణం ఆయా దేశాల్లో వేగంగా తగ్గిపోతున్న జననాల రేటు. యువత పెళ్లి, కుటుంబ జీవితం వైపు ఆసక్తి చూపకపోవడంతో జనాభా క్షీణత తీవ్ర సమస్యగా మారింది. దీనిని అరికట్టేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం సరికొత్త విధానాలతో ముందుకొచ్చింది. డేటింగ్‌, పెళ్లి, పిల్లల పెంపకానికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తూ యువతను కుటుంబ జీవితం వైపు ప్రోత్సహిస్తోంది.

దక్షిణ కొరియాతో పాటు జపాన్, ఇటలీ, చైనా, రష్యా, హంగేరీ వంటి దేశాలు కూడా జనాభా పెంపు కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నాయి. ఇవన్నీ యువతలో భవిష్యత్తుపై భరోసా కల్పించడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి.

Read also: China: ఏఐ పురోగతి ఒక వైపు.. ప్రభుత్వ ఆందోళన మరో వైపు

ఇండియా పరిస్థితి

మన దేశంలో కూడా జనాభా భవిష్యత్తుపై (Dating cash offer) చర్చలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గితే భవిష్యత్తులో రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యత తగ్గే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం భారత్ జనాభా 140 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, పెళ్లి చేసుకునే యువత సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. మారుతున్న జీవనశైలి, కెరీర్ ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యల కారణంగా సంతానం పొందడం కూడా కష్టంగా మారుతోంది. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో భారత్ కూడా జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రేమలో పడండి.. లక్షలు సంపాదించండి!

దక్షిణ కొరియాలోని బుసాన్ వంటి నగరాల్లో యువతను డేటింగ్ వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది. ఒంటరితనాన్ని తగ్గించి సామాజిక సంబంధాలు పెంచడమే ఈ పథకాల ప్రధాన లక్ష్యం.

యువకుడు, యువతి కలిసి డేటింగ్‌కు వెళ్లాలనుకుంటే ప్రభుత్వం వారి ఖర్చుల కోసం సుమారు రూ.30,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తంతో వారు భోజనం, సినిమా లేదా విహారయాత్రలు చేయవచ్చు.

డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకుంటే, గృహవసతి మరియు పెళ్లి ఖర్చుల కోసం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు భారీ ప్రోత్సాహకం అందిస్తున్నారు. అంతేకాదు, పెళ్లికి ముందు ఇరు కుటుంబాలు కలుసుకునే ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Breaking News in Telugu dating allowance scheme dating cash offer dating couples money offer dating reward government Google News in Telugu government dating incentive government marriage bonus Latest News in Telugu marriage incentive scheme population decline solution population growth plan south korea dating policy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.