📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Darshan: దర్శన్‏కు బెయిల్ ఇచ్చిన హైకోర్టు తీరుపై మండిపడ్డ సుప్రీంకోర్టు..

Author Icon By Anusha
Updated: July 25, 2025 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కన్నడ సినీ నటుడు దర్శన్‌కు సంబంధించిన రేణుకస్వామి హత్య కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దర్శన్‌కు కర్నాటక హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేయగా, దీనిపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరం ఇప్పటికే రెండోసారి వ్యక్తమవడం గమనార్హం. న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న తీరుగా ఈ బెయిల్‌ మంజూరు ఉందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.దర్శన్‌ రూల్స్‌ ఉల్లంఘించి బెయిల్‌ మంజూరు చేశారని కర్నాటక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తన అభిమాని రేణుకస్వామి హత్య కేసులో దర్శన్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దర్శన్‌ (Darshan) కు బెయిల్‌ ఇవ్వడం న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడమేనని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిందితులకు బెయిల్ ఇవ్వడంపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఈ కేసులో దర్శన్‌తో పాటు పవిత్రా గౌడ కూడా నిందితురాలిగా ఉన్నారు. ఈ వారంలోనే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించడం ఇది రెండోసారి. హైకోర్టు తన పరిధిని సక్రమంగా వినియోగించకలేకపోయిందని పేర్కొంది. గతేడాది జూన్‌లో యూట్యూబర్ రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి దారుణంగా హత్య చేశారు.

తీవ్ర వ్యాఖ్యలు

ఈ కేసులో దర్శన్‌తో పాటు అతడి ప్రియురాలు, నటి పవిత్రా గౌడ నిందితులుగా ఉన్నారు. ఆమెను వేధింపులకు గురిచేశాడనే ఆరోఫణలతో రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి చంపేశాడు.నటుడు దర్శన్‌ తూగదీప, నటి పవిత్రా గౌడలకు కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ) జస్టిస్ జే.బి. పార్దీవాలా, జస్టిస్ ఆర్. మాధవన్‌ల ధర్మాసనం విచారణ చేప్టింది. నిందితురాలు పవిత్ర గౌడ తరఫున లాయర్ వాదనలు వినిపిస్తుండగా ‘‘దోషిగా మేము నిర్దారించం కానీ, హైకోర్టు చేసిన తప్పు మేము చేయం’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హత్య కేసులో ‘అరెస్ట్ చేయడానికి కారణాలు పేర్కొనలేదు అనే వాదనలను హైకోర్టు ఎలా నమ్ముతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టు జడ్జి పొరపాటు చేశాడంటే సరే అనుకోవచ్చని , కానీ హైకోర్టు న్యాయమూర్తి అయితే ఎలా తప్పు చేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాగా, రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్రా గౌడ మరో 12 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలోని దర్శన్, పవిత్ర గౌడ ప్రధాన నిందితులనే ఆరోపణలు ఇలా ఉన్నాయి.

కోర్టు అభిప్రాయం

పవిత్ర గౌడకు రేణుకాస్వామి అభ్యంతర మెసేజ్‌లు పంపడంతో దర్శన్ తన అనుచరులతో కలిసి అతడిని కిడ్నాప్‌ చేసి హత్య చేయించినట్టు అభియోగాలు నమోదయ్యాయి.సుప్రీంకోర్టు (Supreme Court) ఇప్పుడు ప్రభుత్వ న్యాయవాదులు, దర్శన్ న్యాయవాదులు, పవిత్ర గౌడ న్యాయవాదుల వాదనలను విన్నది. ఆ తర్వాత కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. 10 రోజుల తర్వాత తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టు అభిప్రాయం ఇప్పుడు చాలా చర్చకు దారితీసింది.ఈ కేసు తీర్మానానికి ఎంతో కీలకంగా మారింది. న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని నిలుపుకోవాలంటే, న్యాయ ప్రమాణాలు సమానంగా అమలులోకి రావాల్సిన అవసరం ఉందన్నదే ప్రజల ఆకాంక్ష. ఈ నేపథ్యంలో,సుప్రీం కోర్టు జోక్యం ఇవ్వడం ఒక సానుకూల ముందడుగుగా చూడవచ్చు.

సాండలవుడ్‌ (కన్నడ చిత్ర పరిశ్రమ) నెంబర్ వన్ హీరో ఎవరు?

నవీన్ కుమార్ గౌడ, పాపులర్‌గా యష్ (Yash) పేరుతో ప్రసిద్ధి పొందిన ఆయన, సాండలవుడ్ నెంబర్ వన్ హీరోగా నిలిచారు.

కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు ఎవరు?

యష్ (Yash) కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా గుర్తింపు పొందారు. ఆయన ఒక్క సినిమాకు సుమారుగా ₹50 కోట్లు నుంచి ₹100 కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Narendra modi: ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు

Breaking News darshan bail darshan murder case kannada actor darshan latest news pavithra gowda renukaswamy murder case supreme court on darshan supreme court serious comments

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.