📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Independence day: పాపం జైల్లో స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా దర్శన్, ప్రజ్వల్

Author Icon By Vanipushpa
Updated: August 15, 2025 • 3:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుండగా, ఇద్దరు కన్నడ ప్రముఖులు మాత్రం జైలులో ఆ వేడుకలకు దూరంగా ఉన్నారు. అభిమాని హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్(Darshan), అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (prajwal revanna).. బెంగళూరు(Benglore) సెంట్రల్ జైలులో జరిగిన వేడుకల్లో పాల్గొనలేదు. తీవ్రమైన డిప్రెషన్‌లో ఉండటంతో వారు తమ బ్యారక్‌లకే పరిమితమైనట్లు జైలు వర్గాలు శుక్రవారం తెలిపాయి.
తీవ్రమైన మనోవేదనతో దర్శన్‌
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో దర్శన్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. జైలుకు వచ్చినప్పటి నుంచి దర్శన్ తీవ్రమైన మనోవేదనతో ఉన్నారని, రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదని సమాచారం. జైలు అధికారులు ఆయనకు ఖైదీ నంబర్ 7314ను కేటాయించారు. ఇదే కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆయన భాగస్వామి పవిత్ర గౌడకు ఖైదీ నంబర్ 7313 ఇచ్చారు. గతంలో దర్శన్ అరెస్ట్ అయినప్పుడు ఆయన ఖైదీ నంబర్‌తో అభిమానులు పచ్చబొట్లు వేయించుకోవడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం దర్శన్‌తో పాటు మరో ముగ్గురు నిందితులను ఒకే బ్యారక్‌లో ఉంచారు.

Independence day: పాపం జైల్లో స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా దర్శన్, ప్రజ్వల్

మానసికంగా కుంగిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ
మరోవైపు, అశ్లీల వీడియోలు, అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు ఆగస్టు 1న ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ పరిణామాలతో ఆయన కూడా మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై నటి, మాజీ ఎంపీ రమ్య స్పందించారు. దర్శన్ తన జీవితాన్ని తానే పాడుచేసుకున్నాడని విచారం వ్యక్తం చేశారు. “నేను దర్శన్‌తో కలిసి సినిమాల్లో నటించాను. ఒకప్పుడు స్టేజి లైట్ బాయ్‌గా కెరీర్ మొదలుపెట్టి స్టార్‌గా ఎదిగిన ఆయన కథ విని గర్వపడ్డాను. కానీ ఇప్పుడు ఆయన ప్రవర్తన నన్ను నిరాశపరిచింది. జీవితంలో ఒక స్థాయికి వచ్చాక బాధ్యతగా ఉండాలి. ఆయన చుట్టూ మంచి స్నేహితులు లేరేమో అనిపిస్తోంది” అని ఆమె అన్నారు.

చట్టం ముందు అందరూ సమానమే: రమ్య

రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం జరగాలని తాను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పుడు దర్శన్ అభిమానులు తనను తీవ్రంగా ట్రోల్ చేశారని రమ్య గుర్తుచేసుకున్నారు. “చట్టం ముందు అందరూ సమానమేనని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. ఈ తీర్పు సమాజానికి ఒక మంచి సందేశం పంపుతుంది. ఓ నిరుపేద కుటుంబానికి చెందిన రేణుకాస్వామికి చివరికి న్యాయం జరిగింది” అని ఆమె పేర్కొన్నారు.

దర్శన్ మొదటి భార్య ఎవరు?
దర్శన్ మొదటి భార్య విజయలక్ష్మి. వార్తా వర్గాల ప్రకారం, దర్శన్ కు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న ఏకైక భార్య ఆమె. వారు 2003 లో వివాహం చేసుకున్నారు మరియు వినీష్ అనే కుమారుడు ఉన్నారు.
దర్శన్ మాజీ ప్రియురాలు ఎవరు?
రేణుకస్వామి (1991 – 8 జూన్ 2024) చిత్రదుర్గ నివాసి, కన్నడ నటుడు దర్శన్ తో లేదా అతని కోసం పనిచేస్తున్న వ్యక్తులు దర్శన్ దీర్ఘకాల భాగస్వామి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపారని ఆరోపిస్తూ ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆరోపించబడింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/jk-pilgrims-killed-in-flash-floods-in-jammu-and-kashmir/crime/530620/

Crime News Darshan Independence Day 2025 Jail News Karnataka News Latest News Breaking News Prajwal Revanna

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.