కన్నడ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు దర్శన్ (Darshan) ప్రస్తుతం అభిమాని హత్య కేసులో జైలులో ఉన్నాడు. రెణుక ప్రియ హత్య కేసు విచారణ కొనసాగుతుండగా, అతనికి బెయిల్ లభించకపోవడంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. తాజాగా ఈ కేసులో సంచలన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. దర్శన్ (Darshan) జైలులో తనకు కనీస సౌకర్యాలు కూడా ఇవ్వడం లేదని, ఇలా అవమానకర పరిస్థితుల్లో జీవించలేనని తన న్యాయవాది సునీల్ ద్వారా కోర్టుకు చెప్పించాడు.
Read Also: Surya: సూర్య సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి
బెయిల్ కోసం 20 సార్లు పిటిషన్లు – కానీ ఫలితం లేదు
దర్శన్ ఇప్పటివరకు 20 సార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశాడు. కానీ ఒక్కసారి కూడా కోర్టు ఆ పిటిషన్లను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. విచారణ సాగుతున్నప్పటికీ, కేసు తీవ్రత దృష్ట్యా కోర్టు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది దర్శన్ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని న్యాయవాది వాదించారు. విచారణను త్వరగా పూర్తి చేసి శిక్ష విధిస్తే అనుభవించడానికి దర్శన్ సిద్ధంగా ఉన్నాడని ఆయన పేర్కొన్నారు.
వెన్నునొప్పి సమస్య తిరగబెట్టిందని, తనకు సైనేడ్ ఇస్తే తిని ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్ గతంలో చేసిన వ్యాఖ్యలను న్యాయవాది సునీల్ ఈ సందర్భంగా కోర్టుకు గుర్తు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసి తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: