📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

భారీ పోలీసుల భద్రత మధ్య దళిత జంట పెళ్లి

Author Icon By Vanipushpa
Updated: January 23, 2025 • 4:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సుమారు 200 మంది పోలీసుల భద్రత మధ్య దళిత వరుడు గుర్రంపై ఊరేగాడు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి బారత్‌గా దళిత వధువు గ్రామానికి చేరుకున్నాడు. ఈ వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దళిత వరుడు గుర్రంపై ఊరేగడాన్ని ఆ గ్రామంలోని ఉన్నత కులాల వారు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన వధువు తండ్రి పోలీసుల సహాయం కోరాడు. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దళిత వర్గానికి చెందిన విజయ్ రేగర్‌కు లావెరా గ్రామానికి చెందిన దళిత మహిళ అరుణతో పెళ్లి నిశ్చియమైంది.
కాగా, దళిత వరుడు గుర్రంపై ఊరేగడంపై ఆ గ్రామంలోని అగ్రవర్ణాల వారు వ్యతిరేకం వ్యక్తం చేశారు. దీంతో వధువు అరుణ కుటుంబం ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలో మానవ్ వికాస్ అవమ్ అధికార్ కేంద్ర సంస్థాన్ కార్యదర్శి రమేష్ చంద్ బన్సాల్ సహా స్థానిక కార్యకర్తలను అరుణ తండ్రి నారాయణ్ కలిశాడు. వారి సహాయంతో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశాడు. అలాగే దళిత వరుడి బారత్‌కు భద్రత కోసం పోలీస్‌ అధికారులను కలిశాడు.

మరోవైపు దళిత వధువు అరుణ కుటుంబం ఆందోళనపై అజ్మీర్‌ ఎస్పీ స్పందించారు. దళిత వరుడు గుర్రంపై ఊరేగింపు కోసం భద్రత కల్పించాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. దీంతో పలు పోలీస్‌ స్టేషన్ల నుంచి సుమారు 200 మంది పోలీసులను లావెరా గ్రామంలో మోహరించారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మేళతాళాలు, డ్యాన్సుల మధ్య బారత్‌గా దళిత వధువు అరుణ ఇంటికి చేరుకుని ఆమెను పెళ్లాడాడు.

200 Cops As Security Dalit Groom Rajasthans Ajmer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.