ఉగాది పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషకరమైన వార్త వచ్చింది. 2025 మార్చి 28న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, కేంద్ర ఉద్యోగుల కరువు భత్యం (DA)ను 2% పెంచేందుకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయం కోట్లాది మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలిగించనుంది. పెంపుదల తర్వాత కరువు భత్యం 53% నుంచి 55%కి చేరుకుంది. ఇది ఉద్యోగుల జీతాల్లో స్వల్ప మార్పును తీసుకురానుంది.
కేంద్ర ప్రభుత్వం ఏడు నెలల తర్వాత ఈ సారి DA పెంపుదల అమలు చేసింది. గతంలో 2024 జూలైలో కేంద్రం కరువు భత్యాన్ని 50% నుంచి 53%కి పెంచింది. అదే విధంగా 2023 జనవరిలో 46% నుంచి 50%కి పెరిగింది. అయితే గత కొన్ని పెంపుల మాదిరిగా ఈసారి పెంపుదల 3% లేదా 4% కాకుండా 2% మాత్రమే ఉండడం గమనార్హం.
DA పెంపుతో ఉద్యోగుల వేతనాల్లో మార్పులు
కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని పెంచిన తర్వాత, ఉద్యోగుల జీతాల్లో మార్పు ఎలా ఉంటుందో చూద్దాం ఈ క్రమంలో ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపుపై వారి వేతనంలో మార్పులు రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివిధ వేతనాల్లో ఎలా మార్పులు వచ్చాయో ఇక్కడ తెలుసుకుందాం. రూ.50,000 జీతం ఉన్న వారికి 53% డీఏతో రూ.26,500 కరవు భత్యం లభిస్తుంది. 55% డీఏతో రూ. 27,500కి చేరుతుంది. అంటే రూ. 1,000 పెరుగుతుంది. రూ. 70,000 వేతనం ఉన్న వారికి 53% డీఏతో రూ. 37,100 కరవు భత్యం లభించగా, 55% డీఏతో రూ. 38,500 రానుంది. ఈ మార్పుతో రూ. 1,400 పెరుగుతుంది.
78 నెలల తర్వాత 2% పెంపు
గత 6.6 సంవత్సరాలుగా ప్రతి DA పెంపు 3% లేదా 4% ఉండేది. కానీ ఈసారి 2% మాత్రమే పెరగడం చాలా అరుదైన సంఘటన. 2018లో చివరిసారి 2% పెంచిన తర్వాత, ప్రతి పెంపు 3% లేదా 4%గా ఉండేది. DA పెంపుదల జీతాలపై గణనీయమైన మార్పును తీసుకురాలేకపోయినా, ఇది ఉద్యోగుల దినసరి ఖర్చులకు కొంత ఊరట కలిగించే అంశం. కేంద్ర ప్రభుత్వం జనవరి 2025 నుండి పెంపు అమలులోకి తెచ్చినా, మంత్రివర్గ ఆమోదం మాత్రం మార్చి 28న లభించింది. అందువల్ల జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల DA బకాయిలు ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతంతో పాటు చెల్లించనున్నారు. రువు భత్యం (DA) పెంపు ద్వారా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు – మొత్తం 50 లక్షల మంది ఉద్యోగులకు DA పెంపు ప్రయోజనం అందుతుంది. కేంద్ర పెన్షనర్లు – సుమారు 65 లక్షల మంది పెన్షనర్లకు పెరిగిన DA ద్వారా జీవన వ్యయానికి కొంత ఊరట లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు – DA పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించనప్పటికీ, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అనుసరించి తమ ఉద్యోగుల DA కూడా పెంచే అవకాశం ఉంది.