📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Cyber Scam: అకౌంట్‌లోకి ఉచితంగా డబ్బు ఎరా..సైబర్ మోసాలకు తెర

Author Icon By Saritha
Updated: January 20, 2026 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోయాయి.. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో మోసం చేస్తున్నారు. కొంతకాలంగా బ్యాంకుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. (Cyber ​​Scam) తాజాగా బ్యాంక్ రివార్డ్ పాయింట్ల పేరుతో జనాల్ని ముంచేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో కొంతమందిని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. రూ.9999 రివార్డు పాయింట్లు గడువు ముగుస్తుందని బ్యాంక్ ఆఫ్ ఇండియా రివార్డ్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని క్లెయిమ్ చేసుకోమని మెసేజ్‌లు పంపుతున్నారు.

ఈ మెసేజ్‌తో పాటుగా ‘బీవోఐ మొబైల్.ఏపీకే’ అనే వైరస్ ఫైల్‌ను కూడా పంపిస్తున్నారు. ఒకవేళ పొరపాటున ఈ ఫైల్‌ను క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్‌లు ఖాళీ అవుతాయి. ఈ మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఇది బ్యాంక్ నుంచి వచ్చిన నిజమైన సందేశం అనుకుని, అందులోని లింక్‌ను క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బు మొత్తం పోతుందని హెచ్చరిస్తున్నారు.

Read Also: Nila river: మూడు శతాబ్దాల తర్వాత కేరళలో తొలిసారి కుంభమేళా

ఏపీకే ఫైళ్లతో సైబర్ మోసాలు

గతంలో కూడా ఇలాంటి మోసాలు జరిగాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేరుతో కూడా ఇలాంటి ఏపీకే వైరస్ ఫైల్స్ పంపి సైబర్ నేరగాళ్లు(Cyber Scam) చాలా మందిని మోసం చేశారు. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో మళ్లీ ఈ మోసాలు మొదలయ్యాయి. కాబట్టి, తెలియని నంబర్ల నుంచి వచ్చే ఇలాంటి మెసేజ్‌లను నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఏదైనా సందేహం ఉంటే నేరుగా బ్యాంకును సంప్రదించడం మంచిది అంటున్నారు. సైబర్ నేరగాళ్లు రివార్డు పాయింట్ల పేరుతో వాట్సాప్‌లో ఏపీకే (APK) ఫైళ్లను పంపి మోసాలకు పాల్పడుతున్నారు. (Cyber ​​Scam) ఏపీకే ఫైల్‌ను పొరపాటున క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుంది. వారి ఫోన్ నంబర్ పేరు ‘బీఓఐ’గా మారిపోతుంది. ఆ నంబర్‌కు సేవ్ చేసిన కాంటాక్ట్స్‌కు ఆటోమేటిక్‌గా ఈ ఏపీకే ఫైల్, ఒక సందేశం వెళ్లిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



APK virus Bank Fraud Bank of India Scam Cyber Scam Latest News in Telugu Online scam Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.