దేశవ్యాప్తంగా ఐఫోన్(iPhone) 17 సిరీస్ అమ్మకాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఆపిల్ సంస్థ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్,(Pro Max) కొత్త ఐఫోన్ ఎయిర్‌లను విడుదల చేసింది. ఈ ఫోన్‌లను కొనుగోలు చేయడానికి ప్రజలు స్టోర్ల ముందు భారీగా క్యూలు కట్టారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణేలోని ఆపిల్ స్టోర్ల వెలుపల అర్ధరాత్రి నుంచే ప్రజలు వేచి ఉన్నారు
ముంబైలో క్యూలైన్ల గొడవ
ముంబైలోని జియో(jio) సెంటర్ వద్ద భారీగా జనం గుమిగూడటంతో క్యూలైన్లలో ఉన్న కస్టమర్ల మధ్య గొడవ జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. స్టోర్‌లు ఇంకా తెరుచుకోక ముందే కస్టమర్లు ముందుగానే క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆపిల్ స్టోర్లతో పాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్,(Reliance Digital) క్రోమా వంటి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా అమ్మకాలు జరుగుతున్నాయి.
ధరలు, ఫీచర్లు
ఐఫోన్ 17 ధర రూ.82,900 నుండి ప్రారంభమవుతుంది. ఐఫోన్ ఎయిర్ ధర రూ.1,19,900 కాగా, ఐఫోన్ 17 ప్రో మోడల్ ధర రూ.1,34,900, ప్రో మాక్స్ ధర రూ.1,49,900గా ఉంది. అన్ని మోడళ్లలో బేస్ స్టోరేజ్ 256GB ఉంటుంది. 48MP కెమెరా, A19 చిప్, ప్రోమోషన్ డిస్‌ప్లే వంటి ముఖ్యమైన ఫీచర్లు ఈ కొత్త సిరీస్‌లో ఉన్నాయి.
ఐఫోన్ 17 సిరీస్ అమ్మకాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?
దేశవ్యాప్తంగా ఆపిల్ స్టోర్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అమ్మకాలు జరుగుతున్నాయి.
ఐఫోన్ 17 ప్రారంభ ధర ఎంత?
ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ.82,900.
Read hindi news: hindi.vaartha.com
Read Also: