हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Customer Care:పెరుగుతున్న కస్టమర్ కేర్ నంబరు మోసాలు

Sharanya
Customer Care:పెరుగుతున్న కస్టమర్ కేర్ నంబరు మోసాలు

ప్రస్తుతం డిజిటల్ యుగంలో ప్రతీ చిన్న చిన్న అవసరానికి గూగుల్ (Google) లో ఆధారపడటం మనకు అలవాటైపోయింది. ఇంట్లో ఏదైనా యంత్రం పని చేయకపోతే, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ మొదలైనవాటికి రిపేర్ అవసరం అయితే వెంటనే గూగుల్‌లో తయారీ సంస్థ పేరు టైప్ చేసి కస్టమర్ కేర్ (Customer Care) నంబర్ వెతుకుతాం. కానీ ఇదే మన భద్రతకు పెద్ద ముప్పుగా మారుతోంది. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లను ముందుగా వచ్చేలా చెయ్యడం మొదలు పెట్టారు.

ఎలా మోసపెడుతున్నారు?

సైబర్ నేరగాళ్లు, గూగుల్ అల్గారిథమ్‌ (Google algorithm) లను తమ ప్రయోజనానికి వాడుకుంటున్నారు. జనాన్ని మోసగించేందుకు నకిలీ కస్టమర్​ కేర్ నంబర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రముఖ సంస్థల పేరుతో నకిలీ కాల్​ సెంటర్​ నంబర్లను ఆన్​లైన్​లో పెడుతూ సంప్రదించిన వారిని మోసగిస్తుంటారు. గూగుల్​ అల్గారిథమ్​ను ఆసరాగా చేసుకుని ప్రముఖ సంస్థ కస్టమర్ కేర్ నంబర్ల స్థానంలో ఈ నకిలీ నంబర్లను ముందుగా వచ్చేలా చేస్తున్నారు. ఎవరైనా నంబర్లకు కాల్​ చేస్తే, వారితో మాటలు కలిపి నగదు దోచుకుంటున్నారు.

మోసాల అభివృద్ధి: టెక్నాలజీని ఆయుధంగా మార్చిన నేరగాళ్లు

ఈ నకిలీ నంబర్లు కేవలం గూగుల్‌లో మాత్రమే కాదు, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలోనూ ప్రచారమవుతున్నాయి. వాటిని నమ్మి సంప్రదించేవారు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు.

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా ఉండేందుకు జాగ్రత్తలు

గూగుల్ ఆధారంగా నంబర్ వెతకడం మానేయండి:
కస్టమర్ కేర్ అవసరమైతే అధికారిక వెబ్‌సైట్ లేదా వారంటీ కార్డ్, కొనుగోలు బిల్ పై ఉన్న నంబర్లను మాత్రమే సంప్రదించండి.

బ్యాంకు నంబర్ల విషయంలో జాగ్రత్త:
డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వెనుక భాగంలో ఉన్న నంబర్లను మాత్రమే ఉపయోగించండి.

లింక్‌లు క్లిక్ చేయొద్దు:
కస్టమర్ కేర్ పేరుతో రీఫండ్, వెరిఫికేషన్ పేర్లతో పంపే లింక్‌లను క్లిక్ చేయవద్దు.

కస్టమర్‌ కేర్‌ను సంప్రదించాక వివరాల నమోదు, రీఫండ్‌ పేరుతో లింకు పంపించి క్లిక్‌ చేయాలని చెబితే నమ్మొద్దు

మోసపోతే వెంటనే తీసుకోవలసిన చర్యలు

1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి. ఇది సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్. వీరితో మాట్లాడి తక్షణమే సమాచారం ఇవ్వండి. ఫలితంగా పోగొట్టుకున్న డబ్బు వెంటనే రికవరీ చేయడానికి సాధ్యమవుతుంది.

Read also: Ahmedabad Plane Crash: డీఎన్‌ఏ పరీక్ష ద్వారా 87 మృతదేహాల గుర్తింపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870