500 రూపాయల నోట్లు(Currency) రద్దు అవుతాయని వస్తున్న వార్తలు పూర్తిగా పుకార్లేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్చి వరకు మాత్రమే ఏటీఎంలలో 500 నోట్లు ఉంటాయన్న ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. 500 నోట్లను నిషేధించాలన్న ఆలోచన ప్రభుత్వం లేదా ఆర్‌బీఐకి లేదని తెలిపింది. నోట్ల రద్దుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో(Social media) వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని, ప్రభుత్వ నిర్ణయాలపై సమాచారం కోసం అధికారిక వనరులనే ఆధారంగా తీసుకోవాలని PIB ప్రజలకు సూచించింది.
Read Also: AP CM Foreign Tour: చంద్రబాబు దావోస్ పయనం.. ఆయన వెంట మంత్రి నారా లోకేష్
గతంలో జరిగిన నోట్ల (Currency) రద్దు అనుభవాల నేపథ్యంలో ఇలాంటి వార్తలు ప్రజల్లో భయాందోళనలకు దారి తీస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై నిర్ధారణ లేని సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో, వాటిని నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నగదు వినియోగం, ఏటీఎం లభ్యత, కరెన్సీ చలామణి అంశాల్లో మార్పులు ఉంటే ప్రభుత్వం లేదా ఆర్‌బీఐ అధికారిక ప్రకటనల ద్వారానే ప్రజలకు తెలియజేస్తుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తప్పుడు వార్తలను షేర్ చేయడం చట్టపరమైన చర్యలకు కూడా దారితీయవచ్చని PIB హెచ్చరించింది. ప్రభుత్వ నిర్ణయాలు, ఆర్థిక విధానాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్లు, PIB ప్రకటనలు, ఆర్‌బీఐ నోటిఫికేషన్లను మాత్రమే ఆధారంగా తీసుకోవాలని ప్రజలకు సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: