📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Supreme court: సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టంపై కీలక విచారణ

Author Icon By Shobha Rani
Updated: May 20, 2025 • 5:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వివాదాస్పద వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు(Supreme court) లో ఇవాళ ముఖ్యమైన విచారణ జరిగింది. కొత్త సీజేఐ బీఆర్ గవాయ్ (CJI Gavai)నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో జరిగిన విచారణలో అప్పటి ఛీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా వక్ఫ్ చట్టంలో మూడు క్లాజ్ ల అమలును తాత్కాలికంగా నిలిపేశారు. దీనికి కేంద్రం కూడా అంగీకరించడంతో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. తదుపరి విచారణలో దీన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే తాజాగా సీజేఐగా బాధ్యతలు చేపట్టిన బీఆర్ గవాయ్ (CJI Gavai) మరో న్యాయమూర్తి జస్టిస్ ఆగస్టీన్ జార్జి మాసిహ్ తో కలిసి ఇవాళ ఈ పిటిషన్లపై విచారణ జరిపారు.

Supreme court: సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టంపై కీలక విచారణ

తాజా విచారణ – సీజేఐ గవాయ్ స్పష్టత
ఈ సందర్భంగా వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. కేంద్రం వక్ప్ ఆస్తుల్ని లాక్కోవాలనే దురుద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. చట్టంలో పేర్కొన్న వివాదాస్పద అంశాల్ని ప్రస్తావిస్తూ గత విచారణలో సుప్రీంకోర్టు (Supreme court) వీటి అమలును నిలిపేసిందన్నారు. ఇప్పుడు దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై సీజేఐ బీఆర్ గవాయ్ (CJI Gavai) స్పందించారు. ఇది రాజ్యాంగ బద్ధతకు సంబంధించిన అంశమని, ఇందులో హేతుబద్దమైన కారణం ఉందని చూపించగలిగితే తప్ప సాధారణంగా ఇలాంటి అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని సీజేఐ గవాయ్ (CJI Gavai) తెలిపారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఉన్న వక్ఫ్ ఆస్తుల విషయంలోనూ చాలా వివాదాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అనంతరం వాదనలు వినిపించిన కపిల్ సిబల్.. గతంల ఉన్న వక్ఫ్ చట్టం రక్షిత స్మారక చిహ్నాల స్వభావాన్ని కాపాడిందని తెలిపారు. కొత్త చట్టం ఆ రక్షణలను క్షీణింపజేస్తుందన్నారు. తద్వారా మైనారిటీల హక్కులను ఉల్లంఘిస్తుందని సిబల్ వాదించారు. అయితే దీనిపై ఇవాళ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు వెలువడలేదు. వారి వాదనల సారాంశం: కేంద్రం వక్ఫ్ ఆస్తులను కబ్జా చేసుకోవాలన్న ఉద్దేశంతోనే చట్టం తీసుకువచ్చిందని ఆరోపించారు. గత వక్ఫ్ చట్టం రక్షిత స్మారక చిహ్నాలను కాపాడేదని, కొత్త చట్టం ఆ రక్షణలను తగ్గిస్తోందని తెలిపారు. ఇది మైనారిటీల హక్కులను ఉల్లంఘించడమేనని వాదించారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు.

Read Also: Gaza: గాజాలో 14 వేల శిశువుల ప్రాణాలకు ముప్పు: ఐరాస

Act in Supreme Court Breaking News in Telugu Crucial hearing on Waqf Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.