📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు

Author Icon By Sudheer
Updated: July 2, 2025 • 7:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. గత నెలలో మదురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి తమిళనాడు మదురై జిల్లా అన్నానగర్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అడ్వకేట్ వాంజినాతన్ ఫిర్యాదు మేరకు పోలీసులు పవన్ కళ్యాణ్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, సభ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

నిబంధనల ఉల్లంఘన, రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఆరోపణలు

ఈ కేసులో పోలీసులు IPC సెక్షన్ 196(1)(a), 299, 302, 353(1)(b)(2) ల కింద ముమ్మడిగా కేసు నమోదు చేశారు. సదస్సు సందర్భంగా పవన్ కళ్యాణ్ మతం మరియు ప్రాంతాల ఆధారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు FIRలో ఉన్నాయి. మదురైలో మురుగన్ భక్తుల సదస్సు జరగడానికి ముందే పోలీసులు కొన్ని ఆంక్షలు విధించినా, వాటిని పాటించకుండా కార్యక్రమాన్ని నిర్వహించారన్నది ప్రధానంగా ఫిర్యాదులో పేర్కొన్నారు.

రాజకీయ దుమారం, అధికార వర్గాల స్పందన

ఈ కేసు నమోదు నేపథ్యంలో తమిళనాడు(Tamilanadu)తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి. ఒకరితరఫున ఇది పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదలపై కుట్రగా చూస్తుండగా, మరికొందరు చట్టాన్ని అతిక్రమించినట్లయితే దర్యాప్తు జరగాల్సిందే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికార వర్గాలు మాత్రం కేసు నమోదు ప్రాథమిక దశలోనే ఉందని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి. పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన రావాల్సి ఉంది.

Read Also : Terrorist Arrest రాయచోటి పట్టణంలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

criminal case Google News in Telugu Pawan Kalyan Tamilanadu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.