📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu news: Crime-ప్రైవేట్ స్కూల్ తంటా.. ముగ్గురు పిల్లల గొంతుకోసి.. ఆపై తల్లి ఆత్మహత్య

Author Icon By Pooja
Updated: September 10, 2025 • 2:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Crime-చదువు ముఖ్యమే..కానీ అది ప్రాణాలను బలితీసుకునేంతగా ఉండకూడదు. చదువు జీవితాన్ని బతికించేందుకు ఒక సాధనమే తప్ప అదే ప్రాణాన్ని తీసుకునేంత పదునైన కత్తిలా మారకూడదు. ఓ దంపతుల మధ్య ప్రైవేట్ స్కూల్లో (Private School) చదివించేవిషయంలో జరిగిన గొడవలతో విసిగిపోయిన ఓ ఇల్లాలు తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. తన ముగ్గురు బిడ్డలను గొంతుకోసి, ఆపై ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రేమ వివాహం.. అయినా మనస్పర్థలు

ఉత్తరప్రదేశ్(UttarPradesh) లోని బాగ్వత్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. తిక్రి నివాసి వాకాస్ కశ్యప్ కి, పంజాబ్లోని జలంధర్ కు చెందిన తేజ్ కుమారిల మధ్య ప్రేమ ఏర్పడింది. ఆ ప్రేమ పెళ్లితో ఒక్కటైయ్యారు. ఆపై ముగ్గురు ఆడపిల్లల్ని కన్నారు. అంతా హ్యాపీగా ఉందని అనుకునేసమయంలోనే భార్యాభర్తల మధ్య వివాదాలు ఆరంభం అయ్యింది. వికాస్ ఢిల్లీలో టూరిస్ట్ బస్సు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వికాస్ ఢిల్లీలోని ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తూ టూరిస్ట్ బస్సునడుపుతున్నందన నెలల తరబడి ఇంటికి వచ్చేవాడు కాదు. దీంతో భార్య తేజ్ కుమారి బాలికలతో కలిసి ఢిల్లీలో భర్తతో కలిసి జీవించాలని కోరుకునేది. ఢిల్లీలోనే ప్రైవేట్ స్కూల్లో పిల్లలను చదివించాలని భర్తను కోరింది. ఇందుకు భర్త వికాస్ తన ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు ఢిల్లీకి తనతో తీసుకుకెళ్లానని చెప్పేవాడు.

తరచూ గొడవలతో విసిగిపోయిన భార్య

ఇదే విషయంపై భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల మరోసారి భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో భర్త వికాస్ తన భార్యతో మాట్లాడకుండా బయటకు వెళ్లి చెట్టుకింద పడుకున్నాడు. దీంతో మరింత కోపంగా ఉన్న భార్య తేజ్ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. అనంతరం కత్తితో ముగ్గురు కుమార్తెలను గొంతు కోసం చంపి, ఆపై దుపట్టాతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తర్వాత ఇంట్లోకి వచ్చిన భర్త భార్య గదినుంచి ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు సంఘటనా సంఘటనకు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా.. ముగ్గురు పిల్లల మృతదేహాలు మంచంమీద, తేజ్ కుమార్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తేజ్ కుమారి తన కుమార్తెలను ప్రైవేట్ పాఠశాలలో చదివించాలని కోరుకునేదని, దీనిపై భార్యాభర్తల మధ్య రోజూ గొడవ జరిగేదని పోలీసులు చెప్పారు. భర్త వికాస్ తన భార్యతో మాట్లాడడం మానేసాడు. దీంతో కోపంతో తేజ్ కుమారి మొదట ముగ్గురు బాలికల గొంతుకోసి చంపి, ఆపై ఆత్మహత్య(Suicide) చేసుకుంది. వికాస్ కు ఇది రెండవ వివాహం. వీరిద్దరిది ప్రేమ వివాహం అని పోలీసులు పేర్కొన్నారు. మరణించిన ముగ్గురి కుమారెలు గుంజన్(7), కీటో(మీరా), మీరా(4నెలలు)గా ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో చదివించాలనే విభేదాలు ఇంత దారుణ నిర్ణయానికి వస్తుందని తాను భావించలేదని భర్త వాపోతున్నారు. ముక్కుపచ్చలారని చిన్నపిల్లల్ని చంపేందుకు ఆ తల్లికి మనసు ఎలా వచ్చిందో అని ఇరువురి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

పిల్లల హత్యకు కారణం ఏమిటి?
స్కూల్ ఫీజులు, చదువు ఒత్తిడి, మేనేజ్‌మెంట్‌తో వచ్చిన సమస్యల వల్ల తల్లి తీవ్ర ఆందోళనకు గురై హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం.

పోలీసులు ఏం చేస్తున్నారు?
కేసు నమోదు చేసి, సంఘటన వెనుక నిజమైన కారణాలను వెలికితీసేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/britains-iron-grip-on-visas-the-future-of-indians-is-in-question/international/544480/

Crime in Telangana Latest News in Telugu Mother Suicide with Children Private School Issues School Fee Problems telugu crime news Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.