విద్యార్థులు క్రమశిక్షణతో చదవాల్సిందే. చదువుతో పాటు క్రమశిక్షణ వారికి నేర్పాలి. బెత్తం వాడని తండ్రి కొడుక్కి శత్రువు అని బైబిల్ చెబుతుంది. ఇది టీచర్లకు కూడా వర్తిస్తుంది. విద్యార్థులు అల్లరి చేయకుండా, చక్కగా చదువుకుని వృద్ధిలోకి రావాలంటే తప్పనిసరిగా వారిని అప్పుడప్పుడు శిక్షిస్తుండాల్సిందే. అలాగని వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లేలా ఆ శిక్ష ఉండకూడదు. పిల్లలకు కూడా ఆత్మగౌరవం అనేది ఉంటుంది. ఆ పరిధికి లోబడే వారికి పనిష్మెంట్ ఉండాలి. అలాకాకపోతే ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు(Legal actions) తీసుకోవాల్సి ఉంటుంది.
Read Also: Crime: పాపం చికెన్ అడిగిన కొడుకు.. ఆగ్రహంతో కొట్టి చంపిన తల్లి
హోంవర్క్ చేయలేదని వేలాడదీసిన ప్రిన్సిపల్
హర్యానాలోని పానిపట్ లో ఓ ఘోరం జరిగింది. హోంవర్క్ చేయనందకు రెండవ తరగతి విద్యార్థిని తాడుతో తలకిందులుగా కిటికీకి వేలాడదీసి కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పాఠశాల ప్రిన్సిపాల్ చిన్నపిల్లలను సైతం దారుణంగా చెంపదెబ్బలు కొట్టిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ దారుణాలన్నీ ప్రిన్సిల్ డ్రైవర్ చేయడంతో ఈ ఉదంతం మరింత పెరిగింది. ఏడేళ్ల బాలుడు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. అయితే తాను ఇచ్చిన హోంవర్క్ పూర్తి చేసుకుని రాలేదని పాఠశాల ప్రిన్సిపల్ మందలించాడు. అతనికి పనిష్మెంట్ ఇవ్వాలని తన డ్రైవర్ అజయ్క సూచించాడు.
దీంతో ఆ బాలుడిని శిక్షించేందుకు(punish) అజయ్ పైఅంతస్తులోని గదికి తీసుకెళ్లి, తాళ్లతో కట్టి, కిటికీ నుండి తలకిందులుగా వేలాడదీశాడు. అంతటితో ఆగక చెంపదెబ్బలు కొట్టాడు. అయితే ఇదంతా తన స్నేహితులకు వీడియో కాల్ చేసి బాలుడు వివరించడంతో తల్లిదండ్రులు వెంటనే స్కూలుకు వెళ్లి ఆరాతీయగా ఈ బాగోతం బయటపడింది.
ఈ ప్రిన్సిపల్ క్రమశిక్షణే వేరు
ప్రిన్సిపల్ తాను చెప్పిన మాట వినకపోతే విద్యార్థులతో టాయిలెట్లను క్లీన్ చేయించడం, బహిరంగంగా చెంపదెబ్బలు కొట్టడం లాంటి పనులు చేస్తుంటారని తెలిసింది. పైగా తన ప్రవర్తన సరైందేనని విద్యార్థుల తల్లిదండ్రులకు దురుసుగా సమాధానం ఇస్తుంటారు. ఈ వ్యవహారం పోలీసులకు తెలియడంతో ప్రిన్సిపల్, డ్రైవర్ అజయ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటన బయటపడడానికి కారణం ఏమిటి?
బాలుడు తన స్నేహితులకు వీడియో కాల్ ద్వారా వివరించడంతో తల్లిదండ్రులకు విషయం తెలిసింది.
ప్రిన్సిపాల్ పై ఏమి ఆరోపణలు ఉన్నాయి?
విద్యార్థులను టాయిలెట్లు శుభ్రం చేయించడం, బహిరంగంగా చెంపదెబ్బలు కొట్టడం, దురుసుగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: