బీహార్ రాజధాని పాట్నాలోని పారస్ ఆసుపత్రిలో గురువారం ఉదయం జరిగిన అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. చందన్ మిశ్రా (Chandan Mishra) అనే ఖైదీపై ఐసీయూలో చికిత్స పొందుతున్న సమయంలోనే దుండగులు కాల్పులు జరిపి హత్య (Crime) చేశారు. ఈ ఉదంతం ఆసుపత్రి సీసీటీవీలో స్పష్టంగా రికార్డైంది.
ఐసీయూలోకి నేరుగా దూసుకెళ్లిన దుండగులు
సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, నాలుగు మంది వ్యక్తులు ఆసుపత్రి గదుల్లోకి చొరబడి (into hospital rooms) , నేరుగా ఐసీయూలోకి వెళ్లి, చందన్ మిశ్రాపై వరుసగా రౌండ్లు కాల్పులు జరిపి అక్కడ్నుంచి పారిపోయారు. ఈ ఘటన ఎంత ప్రణాళికబద్ధంగా జరగిందో వీడియో స్పష్టంగా చూపుతోంది.
జీవిత ఖైదీపై హత్య
హత్యకు గురైన చందన్ మిశ్రా బక్సర్ జిల్లాకు చెందినవాడు. ఆయన 2011లో వ్యాపారి రాజేంద్ర కేసరి హత్య (Crime) కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆరోగ్య కారణాల వల్ల 15 రోజుల పాటు పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలోనే ఈ దాడికి గురయ్యాడు.
గ్యాంగ్ వార్ కోణంలో దర్యాప్తు
పాట్నా ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ ప్రకారం, చందన్ మిశ్రాపై ఇప్పటికే అనేక హత్య కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ ఘటన వెనుక ప్రత్యర్థి గ్యాంగ్ పగ ఉండొచ్చని, ప్రత్యేకంగా ‘చందన్ vs షేరు’ గ్యాంగ్‌ల మధ్య గత విరోధం నేపథ్యంలో ఇది జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఆధారాలు ఆధారంగా దుండగుల వివరాలను సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
రాజకీయ కలకలం – ప్రతిపక్షాల విమర్శలు
ఈ హత్య ఘటనపై రాష్ట్రంలో రాజకీయ దుమారం మొదలైంది. కాంగ్రెస్, ఆర్జేడీ సహా ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్ నేతలు వీడియోను సోషల్ మీడియాలో పంచుతూ ‘‘బీహార్‌లో గూండా రాజ్ కొనసాగుతోంది’’ అని ధ్వజమెత్తారు.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ‘‘బీహార్‌లో ప్రజలకు రక్షణ లేదు. 2005 కంటే ముందు ఇలాంటి సంఘటనలు జరిగాయా?” అని ప్రశ్నించారు. ఇండిపెండెంట్ ఎంపీ పప్పూ యాదవ్ అయితే రాష్ట్రంలో అధ్యక్ష పాలన విధించాలని డిమాండ్ చేశారు.
నేరాల పెరుగుదలపై ఆందోళనలు
చందన్ మిశ్రా హత్య మాత్రమే కాకుండా, ఇటీవల పాట్నాలో జరిగిన అనేక హత్యలు రాష్ట్రంలో నేరాలు వేగంగా పెరుగుతున్నాయనే భయాన్ని ప్రజల్లో కలిగిస్తున్నాయి. నేరాలపై ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును ప్రాధాన్యంతో విచారిస్తున్నారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Indore : మరోసారి క్లీన్ సిటీగా ఇండోర్.. అవార్డు అందజేసిన రాష్ట్రపతి ముర్ము