పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన Crime రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం రేపుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించినప్పటికీ, రాత్రివేళల్లో బయటకు వెళ్లడంలో జాగ్రత్తగా ఉండాలని యువతులకు సూచించారు. కోల్‌కతా (kolkata) విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన మమతా బెనర్జీ, “ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంది. కానీ రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగకుండా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు ప్రతి ఒక్కరిని కాపాడలేరు కదా. కాబట్టి భద్రత మన చేతుల్లోనూ ఉండాలి” అని పేర్కొన్నారు. అయితే, ఇటువంటి ఘోర నేరాలపై రాష్ట్ర ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానంతో వ్యవహరిస్తుందని ఆమె స్పష్టం చేశారు. నిందితులను త్వరగా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్న ఆదేశాలు పోలీసులకు ఇచ్చినట్లు తెలిపారు.
Bihar Crime News: భార్యపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన భర్త.. కారణం ఏంటంటే?
Girls, be careful at night.
ఘటన వివరాలు:
ఒడిశాకు (odisha) చెందిన వైద్య విద్యార్థిని శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో భోజనం కోసం బయటకు వెళ్లింది. ఆ సమయంలో కొందరు యువకులు వారిని వెంబడించి, స్నేహితుడిని తరిమివేసి, యువతిని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి దారుణానికి పాల్పడ్డారు. Crime తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించబడిన విద్యార్థినిపై పోలీసులు కేసు నమోదు చేసి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, రాష్ట్ర డీజీపీని ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మెడికల్ కాలేజీ యాజమాన్యం విద్యార్థినికి అన్ని విధాల సహాయం అందిస్తామని తెలిపింది.
దుర్గాపూర్‌లో జరిగిన ఘటనపై సీఎం మమతా బెనర్జీ ఎలా స్పందించారు?
మహిళల భద్రతపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానంతో వ్యవహరిస్తుందని తెలిపారు. అలాగే రాత్రివేళల్లో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు
మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఎందుకు వివాదాస్పదమయ్యాయి?
మహిళల భద్రతను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే అయినప్పటికీ, “అమ్మాయిలు రాత్రివేళ బయటికి వెళ్లొద్దు” అన్న మమతా బెనర్జీ వ్యాఖ్యలు బాధితురాలిపైనే తప్పు మోపినట్లుగా అనిపించాయని పలువురు విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: