📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Crime: అంతులేని ఆమె కన్నీటి వ్యథ

Author Icon By Sharanya
Updated: July 24, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఓ వివాహిత కట్టుకున్న భర్తను, కుమారుడిని కోల్పోయింది. ఈ స్థితిలో ఆమెకు కొండంత అండగా ఉండాల్సిన అత్తమామలే ఆమె పాలిట శత్రువుగా మారారు. ఆదరించాల్సిన వారే ఆ ఇల్లాలిని వదిలించుకునే యత్నం చేశారు. ఆమెను సొంత అత్తామామలే (own in-laws Sold) రూ.లక్షా 20వేలకు అమ్మేశారు. ఆమెను కొనుగోలు చేసిన వ్యక్తి, రెండేళ్లపాటు శారీరకంగా, మానసికంగా వేధించాడు. ఓ మగబిడ్డ జన్మించిన తర్వాత, బాధితురాలిని గ్రామంలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు.

మంటకలిసిన మానవత్వం

పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం, అర్ని పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన బాధితురాలి భర్త, కుమారుడు కొన్నేళ్ల క్రితం మరణించారు. ఆ తర్వాత ఆమె తన మరో కొడుకు, కుమార్తెతో తన అత్తమామల ఇంట్లో నివసిస్తోంది. అయితే అత్తమామలు బాధితురాలిని ఆదరించాల్సిందిపోయి ఆమెను అమ్మేందుకు పథకం రూపొందించారు. ఇందులో భాగంగా గుజరాత్కు (Gujarat) చెందిన ఓ వ్యక్తితో రూ.లక్షా20 వేలకు అమ్మేశారు. రూ.80వేలను ఆమె ముందే అందుకున్నారు. ఆ తర్వాత అతడు బాధితురాలిని తన వెంట తీసుకెళ్లాడు. రెండేళ్లపాటు శారీరకంగా వేధించాడు. దీంతో ఆమె ఓ కుమారుడికి జన్మనిచ్చింది. ఈ సమయంలోనే అతడు ఆమెను గ్రామంలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆమెను పోలీసులు వెతుకున్న సమయంలో వారికి కనబడింది. దీంతో పోలీసులు
ఆరాతీయగా, బాధితురాలు మొత్తం విషయం తెలిపింది. 2023లో బాధితురాలి తల్లిదండ్రులు తమ కుమార్తె, మనవడు, మనవరాలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. అలా అన్వేషిస్తున్న సమయంలో ఆమె దొరికింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నలుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు.

మనం ఏకాలంలో జీవిస్తున్నాం

పైఉదంతం మహిళలు అంతరిక్షంలో పనిచేస్తున్నా వారి కష్టాలు మాత్రం మారడం లేదని నిరూపిస్తున్నది. చదువులలోను, ఉద్యోగాల్లోను వారెన్నో విజయాలను సాధిస్తున్నా, యుద్ధంలో తామేమీ తీసిపోమని నిరూపిస్తూ, సైన్యం చేరుతున్నా వారిపై ఉన్న వివక్షత తొలగిపోవడం లేదు. నిస్సహాయత స్థితిని చూసి, ఆదరించి, సంతోషకరమైన జీవితాన్ని అందించాల్సిన కుటుంబసభ్యులే వారిని ఇబ్బందులకు గురిచేసే ఇలాంటి సంఘటనలు జరగడం విచారకరం.

Read hindi news: hindi.vaartha.com

Read also: Murder: పథకం ప్రకారం ప్రియుడితో భర్తను హత్య చేసిన భార్య

Breaking News crime against women emotional crime story Gujarat in-laws sold latest news Telugu News woman victim injustice

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.