हिन्दी | Epaper
కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Latest news: Crime: ప్రియురాలిని చంపిన మూడునెలలకే వెంటాడిన మృత్యువు

Saritha
Latest news: Crime: ప్రియురాలిని చంపిన మూడునెలలకే వెంటాడిన మృత్యువు

కొన్నిసార్లు నేరాలు చేసి, చట్టం నుంచి పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఆ నేరానికి శిక్ష అనుభవించవచ్చు. కానీ అన్యాయంగా ఒక మనిషి తోటి మనిషిని చంపితే చట్టం కూడా వేయలేని శిక్షను దేవుడే వేస్తాడు. ఎందుకంటే దేవుడు మానవుడిని ఎంతో ప్రేమిస్తాడు. తనను నమ్మి, ప్రేమించి, తనతో అన్ని సుఖాలను పంచుకున్న తర్వాత మోజుతీరిపోయి, ఓ వస్తువులా వాడుకుని, దాన్ని పడేసేలా ప్రేయసిని (Crime) కిరాతకంగా హతమార్చాడు ఓ ప్రియుడు. చివరికి అతడిని మృత్యువు వెంటాడింది. హత్య చేసిన మూడునెలలకే జైల్లో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు తాజాగా గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన గుజరాత్ లోని(Gujarat) సౌరాష్ట్రలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ కు చెందిన నరేంద్ర సింగ్ ధ్రువేల్ అనే వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. అయితే సరిగా ఘటన జరిగిన మూడునెలల తర్వాత అతను జైలులో గుండెపోటుతో మరణించాడు.

Read also: మీడియాలో వైరల్ అవుతున్న సమంత మ్యారేజ్ పిక్స్

Crime
Death haunts him just three months after killing his girlfriend

కర్రలతో కొట్టి చంపిన ప్రియుడు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ కు(Crime) చెందిన నరేంద్ర సింగ్ ధ్రువేల్ అనే వ్యక్తి సౌరాష్ట్రలోని ఒక సిరామిక్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేసే వాడు. అయితే అక్కడ ఇతనికి ఒక యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి.. ఇద్దరూ ఒకే హాస్టల్ లో ఉంటూ జీవనం సాగించేవారు. అయితే కొన్ని రోజులుగా వీరి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మూడునెలల క్రితం జరిగిన ఒక గొడవలో నరేంద్ర సింగ్ తన ప్రేయసిని అతి కిరాతకంగా కర్రలు, చెక్కలతో కొట్టడంతో ఆమె మరణించింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కాగా విచారణలో నిందితుడు నేరం అంగీకరించడంతో అతన్ని జైలుకు పంపించారు పోలీసులు. ఆదివారం తెల్లవారుజామున 4గంటల (ప్రాంతంలో తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించి, నరేంద్ర సింగ్ గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870