బెంగళూరులో(Bangalore) ఓ తెలుగు(Crime) జంట మధ్య జరిగిన ఘర్షణ దురదృష్టకర పరిణామాలకు దారితీసింది. సహజీవనం చేస్తున్న ఈ జంటలో ప్రియుడు ముందుగా ప్రియురాలిని హత్య చేసి, అనంతరం తానే ఉరివేసుకుని మృతిచెందాడు. ఈ ఘటన రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని నగరలో సోమవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. మరణించినవారిని లలిత (49), లక్ష్మీనారాయణ (51)గా గుర్తించారు.
Read also: విద్యుత్ ఛార్జీలు పెంపు పై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు
పొరుగువారికి అనుమానం కిటికీ నుంచి బయటపడిన విషాదం
పోలీసులు(Crime) తెలిపిన వివరాల మేరకు లలితకు ఇప్పటికే కుటుంబం ఉండగా, వ్యక్తిగత సమస్యల కారణంగా బెంగళూరుకు వచ్చి ఉద్యోగం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మీనారాయణతో పరిచయం ఏర్పడి, అతి త్వరలోనే అది ప్రేమ సంబంధంగా మారింది. దాంతో ఇద్దరూ కలిసి గత ఎనిమిదినెలలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. సోమవారం పని ముగించుకొని ఇంటికి వచ్చిన వీరిద్దరూ మద్యం సేవించారని స్థానికులు తెలిపారు. దీనితో మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసినట్లు తెలుస్తోంది.
పోలీసుల అనుమానం ప్రకారం వాదన ఉదృతంగా మారడంతో లక్ష్మీనారాయణ, లలితపై దాడి చేసి ఆమె స్పృహ తప్పిన తర్వాత ఫ్యాన్‌కు ఉరివేసి ఉండవచ్చని భావిస్తున్నారు. అనంతరం అదే చీరతో అతడూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగువారు కిటికీ ద్వారా పరిశీలించగా ఇద్దరూ మృతి చెందినట్లు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల నిజమైన కారణాలు దర్యాప్తులో తెలుస్తాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: