📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Covid Vaccines: ఆకస్మిక మరణాలకు వ్యాక్సిన్లకు సంబంధం లేదు: ఆరోగ్య శాఖ వెల్లడి

Author Icon By Shobha Rani
Updated: July 2, 2025 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాసేపట్లో పెళ్లి అందరూ సంతోషంగా ఉన్న వేళ వరుడు కుప్పకూలి చనిపోతాడు..100 కేజీల బరువెత్తె సామర్థ్యం ఉన్న యువకుడు జిమ్ చేస్తూ అకస్మాత్తుగా ప్రాణాలు వదులుతాడు. సరదాగా ఫ్రెండ్స్ తో ప్లే గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ గుండె నొప్పితో యువకుడు నేలరాలుతాడు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ (Covid Vaccines) కారణమని ప్రచారం జరుగుతోంది. కొంతమంది అదే నిజమని నమ్ముతున్నారు.
ICMR & AIIMS అధ్యయనం ఫలితాలు
ఈ నేపథ్యంలో ఆకస్మిక మరణాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ (Covid Vaccines) కు ఎటువంటి సంబంధం లేదని వెల్లడించింది. ICMR, AIIMS చేసిన అధ్యయనాలలో కోవిడ్-19 వ్యాక్సిన్లకి ఆకస్మిక మరణాలకు మధ్య ఎటువంటి సంబంధం లేదని తేలిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. 2021 అక్టోబర్ నుంచి మార్చి 2023 మధ్య ఆరోగ్యంగా ఉండి అకస్మాత్తుగా మరణించిన వ్యక్తులపై వైద్యులు విస్తృత అధ్యయనాలు చేశారు.
కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన
ఈ క్రమంలో COVID-19 టీకా యువకులలో ఆకస్మిక మరణ ప్రమాదాన్ని పెంచదని వైద్యులు నిర్ధారించారు. యువతలో గుండెపోటుకు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ప్రధాన కారణంగా గుర్తించారు. అంతేకాకుండా అంతర్లీన ఆరోగ్య సమస్యలు, ప్రమాదకరమైన జీవనశైలి, కోవిడ్ తర్వాత సమస్యలతో ఆకస్మిక గుండె మరణాలు సంభవించవచ్చని

కోవిడ్ వ్యాక్సిన్లకు ఆకస్మిక మరణాలకు సంబంధం లేదు: ఆరోగ్య శాఖ వెల్లడి

ప్రాధమిక అధ్యయనాల్లో వెల్లడైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్లు సురక్షితమైనవి, ప్రభావవంతమైనవనీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సినేషన్‌ కారణమనే వాదనలన్నీ తప్పని..ఇటువంటి ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని సూచించింది.
వ్యాక్సిన్లు సురక్షితమైనవే
దేశంలో వాడుతున్న COVID-19 టీకాలు పూర్తిగా సురక్షితమైనవి మరియు ప్రభావవంతమైనవి.
వ్యాక్సిన్ కారణంగా ఆకస్మిక మరణాలు జరుగుతున్నాయని భావించకండి.
అలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించింది.

Read Also:Terrorist Arrest : రాయచోటి పట్టణంలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

Breaking News in Telugu COVID vaccine heart attack COVID vaccine safety India COVID-19 vaccine truth Google news health ministry report 2025 ICMR AIIMS study Latest News in Telugu myocardial infarction myocarditis Paper Telugu News sudden deaths COVID vaccine Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news vaccine misinformation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.