📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

కొనసాగుతున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్..

Author Icon By sumalatha chinthakayala
Updated: November 23, 2024 • 10:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముంబయి: మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ఈరోజు (శనివారం) ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లోనూ హోరాహోరీ పోరు జరగడం, ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ గెలుపెవరిదో నిర్దిష్టంగా తేలకపోవడంతో కౌంటింగ్‌పై ఉత్కంఠ నెలకొన్నది. రెండు రాష్ట్రాల ఫలితాల ప్రభావం వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతో జాతీయ స్థాయిలోనూ ఫలితాలపై ఆసక్తి నెలకొన్నది.

కాగా, ఎన్నికల ఫలితాలు రాకముందే ముఖ్యమంత్రి పీఠంపై పేచీ మొదలైంది. ఎన్నికల్లో మహాయుతి గెలుస్తుందని, అజిత్‌ పవార్‌ కాబోయే సీఎం అంటూ ఆయన పోటీ చేసిన బారామతి నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి. ఏక్‌నాథ్‌ షిండే మరోసారి సీఎం అవుతారని శివసేన నమ్మకంగా ఉంది. మరోవైపు మహావికాస్‌ అఘాడీ(ఎంవీఏ)లోనూ సీఎం పదవిపై పోరు మొదలైంది. కాంగ్రెస్‌ నేత పటోలే ప్రకటనతో శివసేన(ఉద్ధవ్‌) ఎంపీ సంజయ్‌ రౌత్‌ విభేదించారు.

కాగా తొలి అర్ధ గంటలో పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాబట్టి ట్రెండ్స్ మారే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే జరిగింది. ఆరంభంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యం లభించడంతో గెలుపు ఖాయమని అంతా భావించారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ట్రెండ్స్ మారిపోయి బీజేపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Assembly elections Results BJP congress Eknath Shinde Jharkhand

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.