బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లో 46 లెక్కింపు కేంద్రాల్లో ఈ ప్రక్రియ జరుగుతోంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మూడు దశల్లో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో సగటున 57 శాతం పోలింగ్ నమోదైంది.
Read Also: Bihar Election Result : బిహార్ కౌంటింగ్.. వీడనున్న సస్పెన్స్!
విజయం తమదే
ప్రస్తుతం ఎన్నికల్లో విజయం తమదేనని, 2010 నాటి ఫలితాలే పునరావృతమవుతాయని జేడీయూ నేత రాజీవ్ రంజన్ కుమార్ అన్నాారు. ఎన్డీయే అధికారం నిలబెట్టుకుంటుందని జోస్యం చెప్పారు. 2010 బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే 206 సీట్లతో విజయఢంకా మోగించింది. జేడీయూ 115, బీజేపీ 91 సీట్లలో విజయం సాధించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: