భారత రక్షణ రంగంలో మరో చారిత్రక విజయానికి తెరలేపింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన “భార్గవాస్త్ర” అనే కౌంటర్ డ్రోన్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించారు.ఈ ఆధునిక యంత్రాన్ని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAAL) అభివృద్ధి చేసింది. డ్రోన్లను ఎదుర్కొనేందుకు ఇది కీలకంగా మారనుంది.గోపాల్‌పుర్‌లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. Counter Drone System మూడు దశలుగా ట్రయల్స్ చేశారు. ఒక్కో దశలో ‘భార్గవాస్త్ర’ తన టార్గెట్‌ను సూటిగా చేధించింది.మొదటి రెండు దశల్లో ఒక్కో మైక్రో రాకెట్ ప్రయోగించారు. మూడవ దశలో రెండు రాకెట్లు కేవలం రెండు సెకన్లలో ప్రయోగించి, డ్రోన్ల గుంపును ఖతం చేశారు.ఈ యంత్రం శత్రు డ్రోన్లను 2.5 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించగలదు. ఇందులో ఉన్న శక్తివంతమైన రాడార్ టెక్నాలజీ 6 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ముప్పులను పసిగడుతుంది.
రెండు పొరల రక్షణతో మరింత భద్రత
భార్గవాస్త్ర వ్యవస్థ రెండు అంచెల రక్షణను అందిస్తుంది:
మొదటి లెవెల్: అన్‌గైడెడ్ మైక్రో రాకెట్లు. ఇవి 20 మీటర్ల పరిధిలోని డ్రోన్ల గుంపులను నాశనం చేస్తాయి.
రెండో లెవెల్: గైడెడ్ మైక్రో క్షిపణులు. ఇవి నిర్దిష్ట లక్ష్యాలను అత్యంత ఖచ్చితంగా ఛేదిస్తాయి.
ఈ వ్యవస్థ తక్కువ ఖర్చుతో కూడినదిగా ఉండడమే కాకుండా, పూర్తిగా భారతీయ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడింది.
ఎక్కడైనా పనిచేయగల సామర్థ్యం
భార్గవాస్త్ర సముద్ర మట్టానికి 5000 మీటర్ల ఎత్తున్న పర్వతాల్లోనూ సమర్థవంతంగా పని చేస్తుంది. కొండలు, గుట్టలు ఉన్న చోట్ల కూడా ఇది డిటెక్షన్, మిసైల్ రెస్పాన్స్ రెండింటికీ సిద్ధంగా ఉంటుంది.ఈ టెక్నాలజీ “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యాన్ని ముందుకు నడిపే దిశగా పరిగణించబడుతోంది.డ్రోన్ల ముప్పు రోజురోజుకు పెరుగుతోంది. వీటిని ఎదుర్కోవడమే రక్షణ రంగానికి ప్రధాన కర్తవ్యం. భార్గవాస్త్ర వంటి పరిష్కారాలు దేశ భద్రతను మరింత పటిష్టం చేస్తాయి.ఇది భారత్ స్వయంకృషికి ఓ గర్వకారణం. భవిష్య భద్రతా అవసరాలకు సమాధానంగా నిలిచే ఈ సాంకేతికత, రక్షణ రంగంలో గేమ్‌చేంజర్‌గా మారనుంది.
Read Also : Earth’s Oxygen : భూమికి ఆక్సిజన్ డెడ్ లైన్ ఎపుడంటే?