Banglore: సినిమా థియేటర్ అంటే సాధారణంగా వినోదం కోసం వెళ్లే ప్రదేశం. కానీ, బెంగళూరులో ఒక యువతి మాత్రం విభిన్నంగా వ్యవహరించింది. వెండితెరపై సినిమా ప్రదర్శన జరుగుతుండగా, ఆమె మాత్రం ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఆఫీస్ పనిలో తలమునకలైంది. ఈ వింత దృశ్యం ఫోటో రూపంలో బయటకు రావడంతో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి చర్చకు దారితీసింది.
ఫోటో సోషల్ మీడియాలో వైరల్
‘లోక’ సినిమా(‘Loka’ movie) ప్రదర్శన కోసం ఒక వ్యక్తి బెంగళూరులోని థియేటర్‌కి వెళ్ళాడు. తన ముందురోజు కూర్చున్న యువతి పని ఒత్తిడితో ల్యాప్‌టాప్‌లో పనిచేస్తుండటం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఫోటో తీసి రెడిట్‌లో షేర్ చేశాడు. “ఇదే బెంగళూరులోని ఉద్యోగుల స్థితి” అంటూ కామెంట్ పెట్టడంతో ఆ ఫోటో క్షణాల్లో వైరల్ అయింది.
కార్పొరేట్ కల్చర్‌పై విమర్శలు
ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇది కార్పొరేట్ కంపెనీల(Corporate companies) అసలు స్వరూపాన్ని చూపుతోందని, ఉద్యోగులను బానిసల్లా ఉపయోగిస్తున్నారని విమర్శిస్తున్నారు. “ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ థియేటర్” అంటూ వ్యంగ్య కామెంట్లు చేస్తున్నారు. పని-ప్రైవేట్ జీవితం మధ్య సమతుల్యం అవసరమని, కంపెనీలు ఉద్యోగుల వ్యక్తిగత సమయానికి గౌరవం ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.
ఈ సంఘటన ఎక్కడ జరిగింది?
ఈ సంఘటన బెంగళూరులోని ఒక సినిమా థియేటర్‌లో చోటుచేసుకుంది.
యువతి ఏం చేస్తూ కనిపించింది?
సినిమా ప్రదర్శన జరుగుతున్నప్పటికీ, ఆమె ల్యాప్‌టాప్‌లో ఆఫీస్ పనులు చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: