📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Corona updates: దేశంలో కొత్త కరోనా వేరియంట్లు..పెరుగుతున్న కేసులు

Author Icon By Sharanya
Updated: May 26, 2025 • 5:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది. కోవిడ్ మహమ్మారి ముగిసిందన్న భావనలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా, కరోనా కొత్త వేరియంట్లతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ఇటీవల ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్షియం (INSACOG) వెల్లడించిన వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

కొత్త వేరియంట్లు – NB.1.8.1 మరియు LF.7

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్షియం (ఇన్సాకోగ్) డేటా ప్రకారం దేశంలో రెండు కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. NB.1.8.1, LF.7 అనే వేరియంట్లను ఇటీవల భారత్‌లో కనుగొన్నారు. ఈ రెండు వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) “Variants Under Monitoring (VUM)”గా గుర్తించి ప్రత్యేక పరిశీలన చేస్తోంది. ప్రస్తుతం చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఈ వేరియంట్ల వ్యాప్తి గణనీయంగా పెరిగినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

NB.1.8.1 కొవిడ్ వైరస్ కేసు ఒకటి ఏప్రిల్‌లో తమిళనాడులో నమోదయింది. మే నెలలో నాలుగు LF.7 కేసులను గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఈ రెండు సబ్ వేరియంట్లను వేరియంట్స్ అండర్ మానిటరింగ్‌గా వర్గీకరించింది. చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కొవిడ్-19 కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్లు కారణమని పేర్కొంటున్నారు.

రాష్ట్రాల వారీగా కరోనా

దేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువ కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మే నెలలో 278 యాక్టివ్ కేసులు వచ్చాయి. తమిళనాడు, మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరులో కొవిడ్ సంబంధిత మరణం నమోదయింది. కొవిడ్‌తో సహా ఇతర అనారోగ్య సమస్యలతో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. బెంగళూరులో తొమ్మిది నెలల శిశువుకు కొవిడ్‌ పాజిటివ్ అని తేలింది. మహారాష్ట్రలో శనివారం 47 కొత్త కేసులు, ఆదివారం 45 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరింది. రాష్ట్రంలో నాల్గవ కొవిడ్‌-19 మరణం నమోదయింది. డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌తో 21 సంవత్సరాల వ్యక్తి థానేలో మరణించాడు.

వేరియంట్ల లక్షణాలు (Symptoms):

కొత్త వేరియంట్ల లక్షణాలు కొన్ని మునుపటి వేరియంట్లకు పోలికగా ఉన్నప్పటికీ, అలసట, గొంతునొప్పి, తలనొప్పి, దగ్గు, జలుబు, మరియు తక్కువ శ్వాస సామర్థ్యం వంటి లక్షణాలతో కలసి తీవ్రత చూపించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read also: Covid: కరోనాతో 21 ఏళ్ల యువకుడు మృతి

#CoronaAlert #CoronaUpdate #COVID19 #CovidAwareness #IndiaCovid #NewVariants #StaySafe Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.